ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. చెవిరెడ్డికి షాక్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లిక్కర్ కుంభకోణం హాట్ టాపిక్ గా మారింది. రోజుకో కీలక మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఈరోజు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేయగా.. మరోవైపు చెవిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

చెవిరెడ్డి పీఏలు బాలాజీ, నవీన్ అరెస్ట్..

ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ. 8.20 కోట్లు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు బాలాజీని సిట్ పోలీసులు ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లిన సిట్ బృందం, అతడిని అదుపులోకి తీసుకుని, తనతో పాటు మరో నిందితుడు నవీన్‌ను కూడా అరెస్ట్ చేసింది. వీరిద్దరినీ ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు.

two-more-pesons-arrested-in-ap-liquor-scam-case-and-shock-to-chevireddy

చెవిరెడ్డికి షాక్..

అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మరో నిందితుడు వెంకటేశ్ నాయుడును మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు మండే(సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరిద్దరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ముందుగా విధించిన రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో కోర్టు ఈ కస్టడీని మంజూరు చేసింది.

మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

ఇక కేసులో 39వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఏసీబీ కోర్టు దానిని తిరస్కరించింది.

లిక్కర్ స్కాం దర్యాప్తులో సిట్ అంతర్రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా, విదేశాల్లో ఉన్న లింక్‌లపై దృష్టిసారించింది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు వారిని కోర్టు అనుమతితో విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితుల స్టేట్‌మెంట్లు, ఫైనాన్షియల్ లింకులు, విత్‌డ్రాయల్స్, రాజకీయ సంబంధాలు అన్నింటినీ విశ్లేషిస్తున్న సిట్, వివిధ కోణాల్లో ఆధారాలు సేకరిస్తోంది. రానున్న రోజుల్లో ఈ స్కాంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+