రాసలీలలు: కాపురం చెడగొట్టి, లొంగదీసుకుని..
విజయవాడ: ఇద్దరు మహిళల జీవితాలతో చెలగాటమాడిన ఓ యువకుడి ఉదంతం వెలుగు చూసింది. మాజీ ప్రియురాలితోనూ, భర్తను వదిలేసి వచ్చిన మహిళతోనూ అతను ప్రేమాయణం సాగిస్తూ ఇద్దరినీ మోసం చేసే ప్రయత్నం చేశాడతను. తమతో కాకుండా మరో ఇద్దరితో అతడు ప్రేమాయణం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమను మోసం చేసిన వ్యక్తి మరో ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్న అతన్ని కట్టడి చేయడానికి వారు నిర్ణయించుకున్నారు.
మహిళా సంఘాలతో కలిసి వారు విజయవడ నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. తమను మోసగిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తానని మహిళలకు పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలోని మల్లికార్జునపేటకు చెందిన సత్యకుమార్ దుర్గగుడిపై అమ్మవారి ఫొటోలు విక్రయిస్తుంటాడు. అదే ప్రాంతంలో అమ్మవారి ఫొటో ఫ్రేములు కట్టే వ్యక్తితో ఉన్న పరిచయం ఆధారంగా తరచూ అతను వారింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతని భార్యపై కన్నేశాడు. ఒకసారి భర్త లేని సమయంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆపై ఆమెను ఇతర ప్రాంతాలకు తిప్పి తన కోరికలు తీర్చుకున్నాడు.

ఇదే ప్రాంతానికి చెందిన మరో యువతితో ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా, మరొకరిని వివాహం చేసుకుంది. ఆమె భర్తకు విషయం చెప్పి కాపురాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత ఆమెతో కూడా ప్రేమను పంచుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ తన వాంఛ తీర్చుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఫ్రేములు కట్టే వ్యక్తి భార్యతో ఊరెళ్లి కొద్దిరోజులు గడిపిన తర్వాత తీసుకొచ్చి విజయవాడలో వదిలేశాడు.
ఈ విషయం కాస్తా ప్రస్తుతం కాపురం చేస్తున్న మాజీ ప్రేమికురాలికి తెలిసి సత్యకుమార్‌ను నిలదీసింది. దాంతో చంపుతానని బెదిరించాడు. ఇతడి గురించి ఆరా తీసి మరో ఇద్దరు విద్యార్థినులతో ఇతడు సంబంధం నెరుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారిని ఇతడి బారి నుంచి రక్షించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ మహిళా నేతలను ఆశ్రయించారు.
ఆ మహిళ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును కలిశారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. మరో ఇద్దరు యువతులు మోసపోకుండా చూడాలన్నారు. వీరి విషయాన్ని సావధానంగా విన్న పోలీసు కమిషనర్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్‌తో చెప్పారు. తమలా మరో ఇద్దరు మోసపోకూడదనే నగర పోలీసు కమిషనర్‌ను కలిసినట్టు బాధిత మహిళలు మీడియాకు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications