రైతులకు శుభవార్త... నిముషాల్లో రూ.1.60 లక్షల లోన్ మంజూరు
Union Bank Of India: కిసాన్ క్రెడిట్ కార్డుద్వారా నిముషాల వ్యవధిలో రూ.1.60 లక్షల వరకు రుణం పొందే సౌకర్యాన్ని బ్యాంకు కల్పిస్తోంది.
రుణం పొందాలనుకునే అన్నదాతలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తియ్యటి శుభవార్తను చెప్పింది. రైతులకు మెరుగైన సేవలందించేందుకు, సులభంగా రుణాలు పొందేందుకు యూనియన్ బ్యాంక్ డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రైతులకు సులభంగా నిముషాల వ్యవధిలో లోన్లు రాబోతున్నాయి. సంబంధిత శాఖకు వెళ్లకుండానే రైతులు లోన్ పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్ లైన్ లో డిజిటల్ కేసీసీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రిజర్వుబ్యాంకు ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో యూనియన్ బ్యాంకు వీటిని అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ కేసీసీ లోన్ కింద రూ.1.60 లక్షలు పొందొచ్చు.
బ్యాంకుకు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు ఇవ్వడం, బ్రాంచ్ ను సందర్శించడంలాంటివేమీ ఉండవు. నిముషాల్లోనే బ్యాంకు ఖాతా తెరవడంతోపాటు రుణం కూడా మంజూరు చేస్తారు. వెరిఫికేషన్ కూడా ఆన్ లైన్ లోనే పూర్తవుతుంది. జియో ట్యాగింగ్ ఉండటంతోపాటు శాటిలైట్ ఇమేజరీ అండ్ మ్యాపింగ్ ద్వారా పంట సమాచారాన్ని కూడా పొందొచ్చు. ఆధార్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. లోన్ డాక్యుమెంటేషన్, రుణం మంజూరు తదితరాలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతాయి.

రుణం కోసం ధరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మొబైల్ బ్యాంకింగ్ యాప్ VYOM ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వాలి. తర్వాత లోన్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజీ ఓపెనవగానే కొత్త అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. దానితర్వాత లోన్ వివరాలన్నీ కనిపిస్తాయి. రూ.1.60 లక్షల వరకు 9.3 శాతం వడ్డీ ధరపై రుణం తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఆధార్ కార్డు ఉండటంతోనాటు బ్యాంకు అకౌంట్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు ఉండాలి. దీనికి ఓటీపీ వస్తుంది. దీంతోపాటు అవసరమైన ఇతర వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇంకా చాలా బ్యాంకులు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు అందజేస్తున్నాయి. మీరు యూనియన్ బ్యాంక్ వద్దనుకుంటే దగ్గరలోని ఇతర బ్యాంకులకు వెళ్లి కూడా కిసాన్ క్రెడిట్ తరహా రుణాలను పొందొచ్చు.












Click it and Unblock the Notifications