పెరుగుతున్న సీట్లతో 2029 ఎన్నికలు సాధ్యమేనా..? తేల్చి చెప్పిన కేంద్రం..!!
లోక్ సభ - ఎమ్మెల్యే సీట్ల పెంపుకు రంగం సిద్దమైంది. రాజకీయ ముఖ చిత్రం మార్చే మహిళా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు పూర్తయింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ ఈ బిల్లుల ఆమోదం దిశగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్‌తోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. మహిళా రిజర్వేషన్లు 2029 లోనే అమలు కానున్నాయి. అయితే, పెరిగిన స్థానాల్లో ఎన్నికలు 2029 లోనా.. 2034 లోనా అనేది కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
కేంద్రం పార్లమెంట్.. అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ వారంలో జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశ పెడుతున్నారు. దీని ద్వారా మహిళకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్ ఆమోదించిన వెంటనే రిజర్వేషన్ల కసరత్తు మొదలు అవుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ఎస్సీ- ఎస్టీ రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయి. అదే సమయంలో ప్రతీ రాష్ట్రంలో 50 శాతం మేర సీట్లు పెరగనున్నాయి. దీంతో.. పెరిగిన స్థానాల మేరకు మహిళకు 33 శాతం సీట్లు.. అదే విధంగా ఎస్సీ - ఎస్టీ నిష్పత్తి మేరకు సీట్లు కేటాయించనున్నారు. కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న జనగణన పూర్తి చేయటానికి రెండేళ్లు సమయం పట్టనుంది.

సెన్సెస్, డీలిమిటేషన్ కమిటీ సమర్పించే నివేదికలు- కొత్త లెక్కలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేసే విధంగా కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం బిల్లు ఆమోదం.. డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం 2011 జనాభా లెక్కలతోనే వెళ్లనుంది. దీంతో.. 2029 లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పెరుగుతున్న సీట్లతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్లతో అన్ని రిజర్వేషన్లు మారుతాయని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అదే విధంగా డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేసారు. ఇక.. ఈ బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించేలా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా.. మహిళా రిజర్వేషన్లతో ముడి పెట్టటంతో బిల్లు పాస్ కావటం ఖాయమని భావిస్తున్నారు. అదే విధంగా సాంకేతిక, న్యాయ పరమైన ఇబ్బందులు లేకుంటే.. 2029 లోనే పెరిగిన సీట్లలో ఎన్నికలు నిర్వహణ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications