బాస్ ఎవరు? చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బాలయ్య

Unstoppable with NBK 4 Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 4 ఎపిసోడ్‌పై బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఎప్పుడెప్పుడా అంటూ అటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తోన్న ఎపిసోడ్ ఇది.

చంద్రబాబు బావమరిది, టీడీపీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ టాక్‌ షోలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే ఉత్కంఠత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆవహించింది. అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో ప్రతిపక్ష నేతగా ఇందులో పార్టిసిపేట్ చేశారు.

Unstoppable with NBK 4 Bhuvaneswari or Brahmani who is boss Balakrishna asks Chandrababu

ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇందులో అడుగు పెట్టారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీతో జనసేన పొత్తు కుదరటం, రాజమండ్రిలో 53 రోజుల పాటు గడిపిన జైలు జీవితం, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కుటుంబ సభ్యుల మధ్య గల బాంధవ్యాలు.. ఇవన్నీ తాజా ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చాయి.

రాజకీయాల తరువాత బాలకృష్ణ టాపిక్ కుటుంబ సంబంధాలపైకి మళ్లింది. తన చెల్లెలు భువనేశ్వరితో చూసిన రొమాంటిక్ సినిమా ఏదంటూ ప్రశ్నించగా.. మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయంటూ చంద్రబాబు నవ్వుతూ బదలిచ్చారు. బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ జోక్స్ ఉంటాయని కితాబిచ్చారు.

చెల్లి భువనేశ్వరి- కోడలు బ్రాహ్మణిల్లో ఎవరు బాస్ అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వడానికి చంద్రబాబు కొంత ఇబ్బంది పడటం కనిపించింది. ఇంట్లో ఇదొక పెద్ద సమస్య అయిపోయిదంటూ చంద్రబాబు సరదాగా బదులిచ్చారు. మేం అలా ట్రైనింగ్ ఇచ్చి పంపించాం..అని బాలయ్య కామెంట్స్ చేశారు.

నేను మాస్ హీరో అయితే మీరు మాస్ లీడర్ అంటూ బాలయ్య తన బావను ప్రశంసించారు. బోత్ ఆర్ నాట్ సేమ్..అంటూ చంద్రబాబు దానికి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. ఈ పూర్తి ఎపిసోడ్ ఈ నెల 25వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఆహాలో టెలికాస్ట్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+