ముఖ్యమంత్రిగా పవన్- చంద్రబాబు మనసులో మాట

Unstoppable with NBK 4 Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 4 ఎపిసోడ్‌పై బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఎప్పుడెప్పుడా అంటూ అటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తోన్న ఎపిసోడ్ ఇది.

చంద్రబాబు బావమరిది, టీడీపీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ఈ టాక్‌ షోలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే ఉత్కంఠత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆవహించింది. అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో ప్రతిపక్ష నేతగా ఇందులో పార్టిసిపేట్ చేశారు.

Unstoppable with NBK 4 Promo of Chandrababu Naidu is out

ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇందులో అడుగు పెట్టారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీతో జనసేన పొత్తు కుదరటం, రాజమండ్రిలో 53 రోజుల పాటు గడిపిన జైలు జీవితం, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కుటుంబ సభ్యుల మధ్య గల బాంధవ్యాలు.. ఇవన్నీ తాజా ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ ఈ నెల 25వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఆహాలో టెలికాస్ట్ అవుతుంది.

రాజమండ్రి జైలులో మొదటి రాత్రి ఎలా గడిచిందంటూ బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తీవ్ర భావోద్వేగంతో సమాధానం ఇచ్చారు. 53 రోజుల పాటు జైలులో చావు గురించి ఆలోచించలేదనీ పేర్కొన్నారు. జైలు జీవితం గురించి చెబుతున్న సమయంలో చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. ఆయన మాట తడబడటం కనిపించింది.

అర్ధరాత్రి తనను అరెస్ట్ చేశారని, బస్సులో పడుకుని ఉంటే తలుపులు కొట్టారని అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలపెట్టబోనని హెచ్చరించారు. అక్రమ కేసులను నమోదు చేయించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు- కల్యాణ్ బాబు ఇద్దరూ ఈ రాష్ట్రానికి సూర్యచంద్రుల్లాంటి వాళ్లని బాలకృష్ణ కితాబిచ్చారు. రాజమండ్రి జైలు గోడల మధ్య ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరిగిందని, రాష్ట్ర ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చివేసిన తెలుగుదేశం- జనసేన పార్టీ పొత్తు ఎలా కుదిరిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని బాలకృష్ణ అడగ్గా- దాని గురించి చంద్రబాబు వివరించారు.

రెండు నిమిషాల్లోనే పవన్ కల్యాణ్‌తో మాట్లాడానని, ఒక చారిత్రాత్మక నిర్ణయానికి అక్కడే పునాది పడిందని, సమయ స్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని, అది రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అతి తక్కువ సమయంలోనే పొత్తు కుదిరిందని చెప్పారు.

పవన్ కల్యాణ్‌లో సమయస్ఫూర్తి ఉందని, ఎప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఈ ఎపిసోడ్ సందర్భంగా చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అవ్వొచ్చంటూ బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు పవన్ కల్యాణ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+