వర్షాన్ని జయించిన గోవింద నామస్మరణం.. చెక్కుచెదరని భక్తిభావం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజైన శుక్రవారం రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయం ఇచ్చారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదించారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషల నడుమ సాగిన గరుడసేవ భక్తులను పరవశింపజేసింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రాన్ని మార్మోగించారు. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.

Unwavering Faith Lights Up Tirumala as Garuda Seva Continues in Downpour Couldn t Dampen Devotion

వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహనసేవకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భగవంతునికి పరమ భక్తుడైన గరుడాళ్వారిపై స్వామివారు విహరించడం భక్తి, శరణాగతికి ప్రతీకగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గరుడుని దర్శనం సర్వపాప ప్రక్షాళన, జ్ఞాన వైరాగ్య ప్రాప్తికి మార్గమని తెలియజేస్తున్నాయి. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడం తమ జన్మ ధన్యమైనట్లుగా అశేష భక్తజనావళి భావిస్తుంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయ్: ఇదే రైట్ టైమ్.. నిత్యావసరాల ధరల సెగ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయ్: ఇదే రైట్ టైమ్.. నిత్యావసరాల ధరల సెగ

గరుడసేవ సందర్భంగా తిరుమాడ వీధులు జాతీయ సాంస్కృతిక వైభవంతో అలరారాయి. 17 రాష్ట్రాలకు చెందిన 31 కళాబృందాల 863 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, జానపద కళలు, సంగీత వాద్య ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. జమ్మూ కాశ్మీర్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం కళాకారుల ప్రదర్శనలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు శ్రీవారి సేవకులు. అంతకుముందు మధ్యాహ్నం గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి వేర్వేరుగా పరిశీలించారు. ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+