జగన్‌కు మరో షాక్: టిడిపిలోకి ఎమ్మెల్యేల కల్పన?, వర్ల ఏమన్నారంటే?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఓ వారం రోజుల్లో విజయవాడలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో టీడీపీలోకి పునఃప్రవేశం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ అభ్యర్థిగా కల్పన పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ పార్టీలో ఆమె చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొద్ది కాలంగా కల్పన వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీన్ని ఆమె పలుమార్లు ఖండించారు. అంతేగాక, చంద్రబాబుపై అప్పుడప్పుడు తీవ్ర విమర్శలు కూడా చేశారు.

కాగా, 2004లో టీడీపీ నుంచి కల్పన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ తరఫున నిడుమోలు నుంచి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి పాటూరి రామయ్యపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో రెండోసారి కూడా టీడీపీ టికెట్‌పై పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి డివై దాస్‌ చేతిలో పరాజయం చెందారు. అయితే, టీడీపీలో ఉండగా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కూడా పని చేశారు.

uppuleti kalpana likely to join in TDP

ఆ తర్వాత 2013లో ఆమె టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యను ఓడించారు. కల్పన వైసీపీలో చేరడంతో పామర్రు నియోజకవర్గ ఇంఛార్జీగా.. వర్ల రామయ్యను టీడీపీ నియమించింది. ప్రస్తుతం ఆయన గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌‌గా కొనసాగుతున్నారు.

కాగా, ఇటీవల నెమ్మలూరు వద్ద బెల్‌ శంకుస్థాపనలో ఆమె సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. తర్వాత నుంచి టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటోకాల్‌ విషయమై కొన్ని సందర్భాల్లో వివాదాలు మినహా ఎమ్మెల్యే కల్పన, వర్ల రామయ్య మధ్య పెద్దగా విభేదాలు లేకపోవడం ఆమెకు కలిసివచ్చే అంశమే.

ఇది ఇలా ఉంటే, పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరుతున్నట్టు తెలిసి మంగళవారం ఆ పార్టీ కార్యగోష్టి నుంచి హౌసింగ్‌ బోర్డు చైర్మన్, పామర్రు ఇంచార్జ్‌ వర్ల రామయ్య అలిగి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది.

కాగా, దీనిపై రామయ్య మాట్లాడుతూ.. పామర్రులో పార్టీ చాలా బలంగా ఉందన్నారు. సభ్యత్వాల నమోదులో అగ్రస్థానంలో ఉన్నామని, గ్రేడింగ్‌లోనూ తనకు 'ఎ' గ్రేడ్‌ ఇచ్చిన విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి చెప్పానన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తానని వెల్లడించారు. కాగా, కిందిస్థాయి నేతల మాత్రం కల్పన టిడిపిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తామంతా వర్ల రామయ్యతోనే ఉంటామని వెల్లడించినట్లు తెలిసింది.

కళావెంకట్రావుతో కల్పన భేటీ

టిడిపిలో చేరతారన్న వార్తలను నిజయం చేస్తూ ఎమ్మెల్యే ఉప్పులేటిన కల్పన.. బుధవారం టిడిపి ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లోనే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో పాార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+