రైలు టికెట్లు సులువుగా బుక్ చేసుకునే ఉపాయం!

రైళ్లు భారతీయుల జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నారు. పండగల సమయంలో ఈ రద్దీ ఎంతలా ఉంటుందంటే వెయిటింగ్ లిస్టు టికెట్ల సంఖ్యే కొండవీటి చాంతాడం పొడుగుంటుంది. ప్రతి ఒక్కరూ బెర్త్ కన్ఫర్మ్ అయిన టికెట్ పొందాలని ఆశిస్తారుకానీ అన్నివేళలా అది సాధ్యం కాదు. కొన్ని సులభమైన పద్ధతులద్వారా టికెట్లు తొందరగా బుక్ అయ్యే విధానం తెలుసుకుందాం.

IRCTC ద్వారా తొందరగా టికెట్లు బుక్ చేసుకోవడానికి మాస్టర్ జాబితాను సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల సమయం వృథా అవకుండా టికెట్లు బుక్ అవుతాయి. మాస్టర్ జాబితా అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్లను బుక్‌ చేసే క్రమంలో ప్రయాణికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అవి పూరించడానికే ఎక్కువ సమయం పడుతుంది. ఈలోపు టికెట్లు అయిపోతాయి. ప్రయాణం చేయాలనుకుంటున్నవారి వివరాలను ముందుగానే రూపొందించి పెట్టుకోవాలి. ఐఆర్‌సీటీసీ ప్రొఫైల్ విభాగానికి వెళ్లడం ద్వారా ఈ జాబితా తయారు చేసుకోవచ్చు. మాస్టర్ జాబితాను ఎలా సిద్ధం చేయాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 trainticketbooking
IRCTC యాప్‌ను ఓపెన్‌ చేయండి.
* మై అకౌంట్‌ ఆప్షన్‌ను ఎంచుకొని మాస్టర్ జాబితాకు వెళ్లాలి.
* యాడ్ ప్యాసింజర్స్ పై క్లిక్ చేయాలి
* పేరు, వయస్సు వంటి ప్రయాణికులందరి వివరాలను నమోదు చేయండి.
* ఆ తర్వాత సేవ్ చేయండి.

టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ జాబితాను ఎలా ఉపయోగించాలంటే..

* టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్లాన్ మై జర్నీపై క్లిక్ చేయండి.
* స్టేషన్, తేదీని ఎంచుకోండి.
* ఆపై ప్రయాణికుల వివరాలకు వెళ్లాలి.
* యాడ్ ప్యాసింజర్స్ ఆప్షన్‌కు వెళ్లి, మాస్టర్ జాబితా నుంచి ప్రయాణికుల వివరాలను నమోదు చేయాలి.
* నగదు చెల్లింపు చేయండి. మీ టిక్కెట్ బుకింగ్ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+