ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ.. వంగవీటికి కీలక పదవి..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీల్లో నేతలు చాలా మంది పదవుల కోసం వేచి చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం అధినేతల వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యవర్గం ఖరారు చేసారు. మండల స్థాయి నేతలకు పాలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వంగవీటి రాధాకు దక్కే పదవి పైన చర్చ సాగుతోంది. ఎట్టకేలకు ఇప్పుడు దీని పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కూటమి పార్టీల్లో పదవుల హామీల అమలు కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తి కావటంతో నేతలు తమ అధినేతలకు హామీలు గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఇందులో రెండు టీడీపీ, బీజేపీ - జనసేన చెరొకటి దక్కించుకోనున్నాయి. ఈ పదవుల కోసం పార్టీల నుంచి అభ్యర్ధులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల కోసం డిమాండ్ పెరుగుతోంది. మూడు పార్టీలకు కేటాయించాల్సి ఉండటంతో వీటి కోసం పోటీ కనిపిస్తోంది. ఇక.. 2019 ఎన్నికల ముందే టీడీపీ లో చేరిన వంగవీటి రాధాకు అప్పట్లోనే ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు అమలు కాలేదు. రాధ సైతం రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. తిరిగి ఇప్పుడు రాధా చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇదే సమయంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధా భేటీ అయ్యారు. ఈ సమయంలోనే కీలక హామీ వచ్చినట్లు తెలుస్తోంది.

రాధాకు కీలక పదవి..!
వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో, టీడీపీ లో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేసారు. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో హామీ అమలు కాలేదు. 2024 ఎన్నికల్లోకూ కూటమికి మద్దతుగా రాధా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాధా అంత యాక్టివ్ గా లేరు. అటు జనసేన ముఖ్య నేత లతోనూ రాధా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. డీలిమిటేషన్ జరిగితే రాధాకు వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే అంచనాలు వినిపించాయి. ఇప్పుడు డీలిమిటేషన్ కు సాధ్యం కాకపోవటంతో.. తిరిగి రాధాకు ఏ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. కాగా... ఇప్పుడు చంద్రబాబు తో సమావేశంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో ఒకటి రాధా కు ఇచ్చేలా హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో..త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications