ప్రజలకు చేసిన ద్రోహం అలాంటిది: జగన్‌పై వాణీవిశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  YS Jagan Padayatra : మోకాళ్ల యాత్ర చేస్తే ఇంకా బాగుంటుంది | Oneindia Telugu

  అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడ్డారు.

  రోజా నాకు పోటీనా?: తేల్చేసిన వాణీ విశ్వనాథ్, రేపే బాబు సమక్షంలో టీడీపీలోకి?

  తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్న నటి వాణీ విశ్వనాథ్ కూడా జగన్ పాదయాత్రపై నిప్పులు చెరిగారు. జగన్ మైండ్ సెట్ మారలేదని, పాదయాత్ర తొలి రోజే వ్యక్తిగత దూషణకు దిగాడని, ఇక నుంచి డయల్ 1100ను ప్రతిపక్షంగా భావిద్దామని చంద్రబాబు అన్నారు.

  వీపు బాగుంది: ఎన్టీఆర్ మరో బయోపిక్‌పై వర్మ, భర్తను వదిలి.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా?

  వైసీపీ లేదు కాబట్టి డయల్ 1100 ఇక ప్రతిపక్షం

  వైసీపీ లేదు కాబట్టి డయల్ 1100 ఇక ప్రతిపక్షం

  పరిష్కార వేదిక డయల్‌ 1100నే ప్రతిపక్షంగా పరిగణించి, ఆ విభాగానికి ప్రజలు చేసే ఫిర్యాదులు, చెప్పే అభిప్రాయాలపైన అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష వైసిపి లేదని అసెంబ్లీ సమావేశాలను తేలిగ్గా తీసుకోవొద్దని, మరింత సజావుగా సభ జరగాలని, మంత్రులు ప్రతి ప్రశ్నకు, చర్చకు బాగా సన్నద్ధమై వచ్చి సమాధానామివ్వాలన్నారు.

  ప్రజలకు చేసిన ద్రోహానికి మోకాళ్ల యాత్ర

  ప్రజలకు చేసిన ద్రోహానికి మోకాళ్ల యాత్ర

  చేసిన పాపాలు కడుక్కునేందుకు జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని వాణీ విశ్వనాథ్‌ ఎద్దేవా చేశారు. ప్రజలకు చేసిన ద్రోహానికి ఆయన మోకాళ్ల యాత్ర చేస్తే ఇంకా బాగుండేదన్నారు. ఆయన ప్రజలకు చేసిన ద్రోహం అలాంటిదని అభిప్రాయపడ్డారు.

   ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితి లేదు

  ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితి లేదు

  వైయస్ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వాణీ విశ్వనాథ్ అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీకి సిద్ధమేనని కూడా చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీలో చేరతానని చెప్పారు.

   పొర్లు దండాలు పెట్టినా నమ్మరు

  పొర్లు దండాలు పెట్టినా నమ్మరు

  జగన్ పాదయాత్ర చేస్తుండడం విడ్డూరమని, ఆయన పొర్లుదండాలు పెట్టినా ప్రజలు నమ్మరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎందుకు పాద యాత్ర చేస్తున్నారో స్పష్టత లేనివారు పాదయాత్ర చేస్తుండడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన 1100 కాల్‌సెంటరు జగన్‌ కన్నా మంచి ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందన్నారు. వైసీపీ నుంచి ఇప్పటివరకు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారని, ఆ భయంతోనే ఉన్నవారిని కాపాడుకుందామని పాదయాత్ర చేస్తున్నారన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actress Vani Viswanath on Monday fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి