కొండా సురేఖ రూ.200 కోట్లు దాస్తే: జగన్‌పై వర్ల సంచలనం, 100 ప్రశ్నలతో నిలదీత

Posted By:
Subscribe to Oneindia Telugu
YS Jagan Padayatra : 100 Questions To YSR Congress Party Chief

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆయనకు వంద ప్రశ్నలు సంధించారు.

జగన్ పాదయాత్ర,15 మంది టీడీపీలోకి జంప్?

పాదయాత్ర నిర్వహించడానికి ముందు తాను విసిరే వంద శ్నలకు సమాధానం చెప్పాలని వర్ల అన్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. వంద ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

 చంద్రబాబుకు లేఖ రాసింది నిజం కాదా

చంద్రబాబుకు లేఖ రాసింది నిజం కాదా

వర్ల రామయ్య తన లేఖలో, మీనాన్న ముఖ్యమంత్రి కాక ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవాలని నాటి సీఎం చంద్రబాబుకు మీ నాన్న లేఖ రాసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

 ఇప్పుడు అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాల్లో ఒకటి

ఇప్పుడు అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాల్లో ఒకటి

అలాంటి మీ కుటుంబం ఈ రోజు దేశంలోనే అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే అతికొద్ది కుటుంబాలలో ఒకటిగా ఎలా రూపాంతరం చెందింది? అన్న విషయాలను ప్రజలకు చెప్పాలన్నారు.

 మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోగలరా

మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోగలరా

మీపైన ఉన్న 11 సీబీఐ చార్జీషీట్లలో పేర్కొన్న అవినీతిపై ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు వివరించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలరా? అని జగన్‌కు వర్ల సవాల్ విసిరారు.

 బెంగళూరులో రూ.500 కోట్ల భవనం

బెంగళూరులో రూ.500 కోట్ల భవనం

బెంగళూరు యలహంక ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయలతో మీరు నిర్మించిన విలాసవంతమైన భవనం గురించి ప్రజలకు వివరించాలని, గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి సీఎం కాక ముందు మీకు ఇటువంటి ఆస్తులు లేవు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పాలన్నారు.

 కడప సామాన్య ప్రజలకు చెప్పు

కడప సామాన్య ప్రజలకు చెప్పు

బెంగుళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో బినామీ పేర్లతో వేలకోట్లు విలువ చేసే వందల బినామీ భవనాలు మీకు ఉన్నది నిజమా కాదా చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. బెంగుళూరు నగర నడిబొడ్డున మంత్రి మాల్‌, అరికేరిలో వందల ఎకరాల భూములు గేటెడ్‌ టౌన్‌షిప్‌ మీకు ఎలా వచ్చాయో, బినామీలుగా ఉన్న కడప సామాన్య ప్రజల పేర్లు ప్రజలకు చెప్పాలన్నారు.

 విదేశాల్లోని ఆర్థిక లావాదేవీల గురించి చెప్పండి

విదేశాల్లోని ఆర్థిక లావాదేవీల గురించి చెప్పండి

మీకు, మీ కుటుంబానికి లండన్, సైప్రస్, మార్షియన్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్, లక్సెంబర్గ్ తదితర విదేశాల్లో ఆర్థిక లావాదేవీల గురించి ప్రజలకు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

 కొండా దంపతులపై ఆసక్తికరం

కొండా దంపతులపై ఆసక్తికరం

కొండా సురేఖ దంపతులు రూ.200 కోట్లు మీదగ్గర దాస్తే, ఆ సొమ్ము ఎగవేతతో మీపై ఒత్తిడి తెచ్చి, మీకు భయపడి మీ పార్టీని వదిలి పారిపోయింది నిజం కాదా చెప్పాలని వర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై వివరణ ఇవ్వాలన్నారు.

సాక్షి పుట్టుక గురించి చెప్పండి

సాక్షి పుట్టుక గురించి చెప్పండి

2009 ఎన్నికల ముందు వైయస్ చాంబర్‌లో మీరు కూర్చొని మార్చి 2వ తేదీన 389 జీవోలు మీకు అనుకూలంగా జారీ చేయించుకొని అవినీతి సొమ్ము మూటలు కట్టింది నిజం కాదా చెప్పాలని వర్ల ప్రశ్నించారు. సాక్షి పుట్టుక, దాని ఆర్థిక వనరుల గురించి ప్రజలకు చెప్పాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Varla Ramaiah 100 questions to YSR Congress Party chief YS Jaganmohan Reddy before starting Padayatra.
Please Wait while comments are loading...