దమ్ములేదు, పిచ్చివాడిగా..: పవన్‌ను కడిగేసిన వాసిరెడ్డి

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దిన పత్రికకు జనసేన పార్టీ అధ్యక్షలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె పవన్‌ను కడిగిపారేశారు. పవన్ పార్టీని పార్టీ అనాలో లేక క్లబ్ అనాలో అర్థం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ముసుగు నేటితో పూర్తిగా తొలగిపోయిందన్నారు. పవన్ పార్టీని తాము ముందు ప్రజాస్వామ్యయుతంగా ఆహ్వానించామన్నారు.

పవన్ తన రాజకీయ పరిజ్ఞానాన్ని ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ను ప్రత్యక్ష్యంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు ఓ వైపు మోడీ మాస్కును, మరోవైపు పవన్ మాస్కును వేసుకొని వస్తున్నారన్నారు. పవన్‌కు పార్టీ పెట్టి పోటీ చేసే ధైర్యం లేదని, చంద్రబాబుకు జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేదన్నారు. అందుకే అందరు కలిసి గ్రాండ్ స్కాంకు తెరలేపారన్నారు.

Vasireddy Padma questions Pawan Kalyan

బాబు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారన్నారు. రాజకీయాల్లోను బాబు బినామీల సంస్కృతిని తీసుకు వచ్చారన్నారు. పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం విడ్డూరమన్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందమని ఎద్దేవా చేశారు. ఎననికల్లో పోటీ చేయలేని ఓ పార్టీ అధినేతకు ఈనాడు కవరేజ్ అంత అవసరా అన్నారు. జగన్‌ను విమర్శించడమే ఎజెండాగా ముందుకు వస్తున్నారన్నారు. పార్టీనో కాదో తెలియని పవన్ కోసం మూడు పేజీలు కేటాయించి, ఆకాశానికెత్తుతారా అన్నారు.

రామోజీ రావుకు ఇన్ని సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము పవన్‌కు లేదన్నారు. పార్టీ పెట్టి పోరాడే ధైర్యం పవన్‌కు లేదు, గెలిచే శక్తి బాబుకు లేదన్నారు. చంద్రబాబు సమయంలో శాంతిభద్రతలు బాగున్నాయని చెబుతున్న పవన్.. పరిటాల చేయించిన హత్యల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పవన్ వాటిని మర్చిపోయారా లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారా అన్నారు.

చేగువేరా, గద్దర్ అంటూ విప్లవ భావాలు ఉన్నాయని చెప్పుకునే పవన్‌కు.. నక్సలైట్లు చంద్రబాబుపై దాడి చేసేందు స్థాయికి దిగజారారని తెలియదా అన్నారు. దానిపై ఏం చెబుతారన్నారు. పవన్ సామాన్యుడు కాదని... మేథావి అని ఎద్దేవా చేశారు. జగన్ ఆస్తులపై మాట్లాడుతున్న పవన్‌కు అవి రాజకీయ కేసులు అని తెలియక పోవడం ఆయన అజ్ఝానానికి నిదర్శనమన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదన్నారు.

మీ అన్న చిరంజీవి మంచం కింద పెట్టుకున్న కోట్లకు ఎప్పుడైనా లెక్కలు అడిగావా అని ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొన్న వారు దొంగలు.. తప్పించుకున్న వారు కారా అని ప్రశ్నించారు. మీ పవనిజం ఏమిటో తెలిసిపోయిందన్నారు. మీరు సినిమా హీరో కాబట్టి, మిమ్మల్ని ఇష్టపడే వారు ఉంటారు కాబట్టి.. వారు మిమ్మల్ని పిచ్చివాడిగా చూసే పరిస్థితి నుండి బయటపడతారనే తాను మీకు సూచనలు చేస్తున్నానని చెప్పారు. వైయస్ అన్యాయం చేస్తున్నారని పవన్ ఎప్పుడు చెప్పలేదే అన్నారు.

ఈ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ధిక్కరించి, ఒక పార్టీని స్థాపించి ఐదు లక్షలకు పైగా మెజార్టీతో ఉప ఎన్నికల్లో గెలిచి, మరో ఎన్నో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోయించిన జగన్‌కు ఎల్లో పత్రికలో ఇచ్చిన స్థానమేమిటో చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేని పవన్‌ను ఆకాశానికెత్తుతారా అన్నారు. 2009లో లేని గొప్ప లక్షణాలు ఇప్పుడు పవన్‌లో కనిపించాయా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+