'బాలకృష్ణకు కూడా బాబు టిక్కెట్ ఇవ్వరు, అందుకే జగన్‌కు నేతలు కరువు'

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించే వారిలో తాను ఉన్నానని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు ప్రకటించారని కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అన్నారు. గెలవడని భావిస్తే తన సొంత బావమరిది, నటుడు బాలకృష్ణకు కూడా చంద్రబాబు టికెట్‌ ఇవ్వరని వ్యాఖ్యానించారు.

టార్గెట్ జగన్: ఆనం వివేకానంద మౌనం వెనుక, తమ్ముడికి మంత్రి పదవి?

ఆయన సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ అధినేత వైయస్ జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడం పగటి కలలే అన్నారు. ఆ మాటకు వస్తే ఆయన ఏ కలలో కూడా ముఖ్యమంత్రి కాలేరన్నారు.

 అందుకే వైసీపీకి నిజమైన నేతల కరువు

అందుకే వైసీపీకి నిజమైన నేతల కరువు

వైయస్ రాజశేఖర రెడ్డిలో ఉండే నైతిక విలువలు జగన్‌లో మచ్చుకు కూడా కనిపించవని వీరశివా రెడ్డి అన్నారు. సూటుకేసులు మోసేవారికి బంధువులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వైసీపీకి నిజమైన నేతలు కరువయ్యారన్నారు. దీంతో ఆయన నియోజకవర్గాల వారీగా కుటుంబ సభ్యులనే నేతలుగా చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

 మేనమాన గెలిచారు

మేనమాన గెలిచారు

జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని భావించి కొందరు గత ఎన్నికల్లో వైసీపీ నేతనలు గెలిపించారని, అందులో ఆయన మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఒకరని వీరశివా రెడ్డి చెప్పారు. పదవి కోసం జగన్‌ చేపట్టిన పాదయాత్రను ప్రజలు ఏ మాత్రం గుర్తించడం లేదని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారన్న భావన కూడా ప్రజలకు లేదన్నారు.

 కడపలో మెజార్టీ సీట్లు లక్ష్యం

కడపలో మెజార్టీ సీట్లు లక్ష్యం

పులివెందుల వలె కమలాపురాన్ని కూడా తన సంస్థానంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు చేసే ప్రయత్నాలు సఫలం కావని వీరశివా రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. కమలాపురం నియోజకవర్గంలో పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేస్తామన్నారు. కడప జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించడమే చంద్రబాబు ఆశయం అన్నారు.

 ఎన్నికలకు ఫిట్ అయితేనే తీసుకుంటారు

ఎన్నికలకు ఫిట్ అయితేనే తీసుకుంటారు

ఎన్నికలకు ఫిట్‌ అయిన వారినే చంద్రబాబు దగ్గరకు తీసుకుంటారని వీరశివా రెడ్డి అన్నారు. లేదంటే దూరం పెడతారన్నారు. గెలవరనుకుంటే బాలకృష్ణకూ టిక్కెట్ ఇవ్వరన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయమని, చంద్రబాబే సీఎం అని జోస్యం చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Veera Siva Reddy interesting comments on Hindupuram MLA Balakrishna and YSRCP chief YS Jagan Mohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి