ఆశ్చర్యపోయా: గౌతమీపుత్ర శాతకర్ణిపై వెంకయ్య, మనవడి గురించి బాలకృష్ణ
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తిలకించారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తిలకించారు. ఆయన హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను చూశారు.
అనంతరం వెంకయ్య మాట్లాడారు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచేలా శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను అందించిన దర్శకులు క్రిష్‌కు అభినందనలు తెలిపారు. నటుడు బాలకృష్ణ, మాటల రచయిత సాయిమాధవ్‌తో పాటు సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.

అతి తక్కువ కాలంలోనే ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం తననెంతో ఆశ్చర్యానికి గురి చేసిందని వెంకయ్య అన్నారు. సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపని తనకు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఆకట్టుకుందని, తప్పకుండా మరింతగా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు.
ఆడుకుంటున్నాడు: బాలయ్య
తన మనవడు దేవాన్ష్ గురించి హీరో బాలకృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. దేవాన్ష్‌కు ఇంతకుముందు గుర్రం అంటే భయపడేవాడని, ఇప్పుడు తన సినిమా చూసిన తర్వాత ఆ భయం పోయి, వాళ్ల అమ్మ కొనిచ్చిన గుర్రం బొమ్మ పైకి ఎక్కి ఆడుకుంటున్నాడని చెప్పారు.












Click it and Unblock the Notifications