పవన్ కళ్యాణ్, జై చిరంజీవ - మృతజీవి: వెంకయ్య

హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వంటివారు పుట్టిపెరిగినవారేనని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వారిద్దరే కాదు, చిరంజీవి, నాగార్జునే కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడివాడేనని ఆయన అన్నారు. తిరుపతిలో బుధవారం సాయంత్రం జరిగిన నరేంద్ర మోడీ సభలో ఆయన ప్రసంగించారు. వారే కాదు, ప్రభాస్, వెంకటేష్ ఇక్కడివారేనని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తోక ముడుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏమైనా రాష్ట్ర విభజన జరిగిందని, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. అందుకు కేంద్రంలో, రాష్ట్రంలో అనుకూలమైన ప్రభుత్వాలు రావాలని ఆయన అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు.

Venkaiah says Pawan Kalyan from Andhra

సీమాంధ్రకు నీళ్లు ఇవ్వనని కెసిఆర్ అంటున్నారని, అదేమైనా కెసిఆర్ బాబు సొమ్మా అని ఆయన అన్నారు. ఎంత మంది కెసిఆర్‌లు వచ్చిన పోలవరం ప్రాజెక్టును ఆపలేరని ఆయన అన్నారు. ప్రధాని పేరు చెప్పాలంటే కాంగ్రెసు కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ హవాను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. బిజెపి 300కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయన అన్నారు. కావాల్సింది పురుషతనం, మగతనం కాదని, పనితనం కావాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీలో పనితనం ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన సముద్ర తీరం ఉందని, ఓడరేవులు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. చిరంజీవి కాంగ్రెసు కోసం తిరుగుతున్నారని, తానేమో జై చిరంజీవి, కాంగ్రెసు మృతజీవి అని ఆయన అన్నారు. అంతా అయిపోయిన తర్వాత సమైక్యాంధ్ర అని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ఇదేమైనా పాతాళభైరవి సినిమానా అని ఆయన అన్నారు. అమెరికాలోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది ఆంధ్రప్రదేశ్ వారేనని, అమెరికాలోని ఐటి నిపుణుల్లో సగం మంది సీమాంధ్రకు చెందినవారేనని ఆయన అన్నారు.

హైదరాబాదు వల్ల కోల్పోయిన సంస్థలు సీమాంధ్రకు రావాలంటే, రెవెన్యూ లోటు భర్తీ కావాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. అకాశాన్ని, అంతరిక్షాన్ని, భూగర్భాన్ని, భూభాగాన్ని వదలకుండా కాంగ్రెసు పార్టీ అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు. జలయజ్ఞంతో వందలాది కోట్లు దోచుకున్న ఘనత కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+