శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి

వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు. ప్రధానంగా సినిమా రంగంలో నాలుగైదు సంఘటనలు ఆయన చెప్పినట్లు జరగడంతో ఒక్కసారిగా ఆయన పేరు మార్మోగింది. రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయతిలాంటివారు ఆయనచేత పూజలు చేయించుకున్నారు. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు ఎవరివి? ఇప్పుడు వాటి ఫలితాలేంటి? అనే శోధనలో నెటిజన్లు ఉంటున్నారు.

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా శ్రీలీల రాణిస్తోంది. దాదాపు ఆమె చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. కుర్ర హీరోలతోపాటు స్టార్ హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. గుంటూరు కారం సినిమాలో ప్రధాన హీరోయిన్ అయింది.

sreeleelavenuswamy1

సినీ పరిశ్రమకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాలు వస్తుంటాయి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నవారు చాలా తక్కువమందే ఉంటారు. అలాంటివారిలో శ్రీలీల ఒకరు. పెళ్లిసందడి సినిమాతో పరిచయమైన ఈ భామ జోరు మాంచి రేంజ్ లో ఉంది. ఇటువంటి చలాకీ భామ జాతకాన్ని వేణుస్వామి చెప్పారు. తన జాతకంలో రాజయోగం ఉందని, రానున్న రోజుల్లో ఆమె కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయనేకానీ తగ్గవని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. 2028లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీలీలే టాప్ హీరోయినగా కొనసాగనుందని చెప్పారు. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార జాతకానికి, శ్రీలీల జాకతానికి దగ్గరి పోలికలు ఉన్నాయని వేణుస్వామి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+