పవన్ కల్యాణ్ పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది, అతన్నే బ్లాక్ మెయిల్ చేస్తా
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది.కిరణ్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్న లక్ష్మి.. తనకు చావే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.అయితే జగన్‌ను విమర్శించడం వల్లే తనని ఈ కేసులో ఇరికించారని చెప్పి కిరణ్ రాయల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు బాధితురాల లక్ష్మిపై అనేక కేసులు ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన లక్ష్మి ,కిరణ్ రాయల్ గురించి మరిన్ని విషయాలను బయటపెట్టారు.శనివారం మీడియా సమావేశం నిర్వహించిన లక్ష్మి, కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ తనతో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ తనని ఏమీ అనడని, ఎందుకుంటే ఆయనకు సంబంధించిన పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉందని, అందుకే చంద్రబాబు, జగన్‌ను నా ఇష్టం వచ్చినట్టు తిట్టినా పవన్ నన్ను ప్రశ్నించడని, కిరణ్ రాయల్ తనతో చెప్పినట్టుగా లక్ష్మి తెలిపారు.
నా వెనుకాల పవన్ కల్యాణ్ ఉన్నారని కిరణ్ రాయల్ చెప్పారని, ఇప్పుడు నిజంగా అడుగుతున్నా, కిరణ్ రాయల్ వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారా అని లక్ష్మి ఈ సందర్భంగా ప్రశ్నించారు.దండం పెట్టి ఆడిగినా పవన్ కల్యాణ్ స్పందించలేదని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది మహిళలు జీవితాలు నాశనం చేస్తున్నావ్ కదా అని కిరణ్ రాయల్‌ను ప్రశ్నిస్తే.. నన్ను ఎవరు ఏం చేస్తారు.. నేను పవన్ కల్యాణ్‌నే బ్లాక్ మెయిల్ చేస్తా నువ్వు ఎంత అంటూ కిరణ్ రాయల్ బెదిరించాడని లక్ష్మి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications