• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వేళ కొత్త పాత్రలో రోజా... అటు నగరిలో ఇటు ఇంట్లో ఏంచేస్తున్నారో తెలుసుకోవాలంటే..?

|

చిత్తూరు: కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. ఈ మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇళ్లకే పరిమితం కావడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇక ప్రజాప్రతినిధులు మాత్రం తమదైన శైలిలో రోడ్లపై కనిపిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరికొందరు ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. ఇక ఇందుకు వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా ఇందుకు మినహాయింపు కాదు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే రోజా... తాజాగా ఇంట్లో గరిటె తిప్పుతూ వార్తల్లో నిలిచారు. ఇంతకీ వంటగదిలో ఎమ్మెల్యే రోజా ఏం చేసిందో తెలుసా...?

లాక్‌డౌన్ సమయంలో ఎమ్మెల్యే రోజా ఏం చేస్తున్నారు..?

వైసీపీ ఎమ్మెల్యే రోజా నిత్యం స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉంటారు. ఆమె ఏది చేసినా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె ప్రతిపక్షాలపై విరుచుకుపడినా... తన నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు చేసినా ఆ వార్త ప్రసారమాధ్యమాల్లో టెలికాస్ట్ అయ్యిందంటే వీక్షకులు కూడా కళ్లార్పకుండా చూస్తారు. ఇక లాక్‌డౌన్ సమయంలో రోజా ఒక ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు . అంతేకాదు తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా శానిటైజేషన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. స్వయంగా ఆమెనే పరిసరాలను పిచకారి చేశారు. ఇక నగరి నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఆహారం ప్యాకెట్లు కూడా పంచిపెట్టారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే పేద ప్రజలకు ఇచ్చిన ఆహారంను స్వయంగా రోజానే తయారు చేయడం విశేషం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.

వంట గదిలో గుమగుమలాడే వంటకాలు తయారు చేస్తున్న రోజా

ఇక ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యత అలా నిర్వర్తిస్తుంటే ఒక సామాన్య గృహిణిలా కూడా తన కుటుంబ సభ్యులకు తానే వంట వండి పెడుతోంది. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైనప్పుడు రోజా స్వయంగా గరిటె తిప్పుతున్నారు. అంతేకాదు తాను చేస్తున్న వంటలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆమె చేస్తున్న వంటలకు ఆమె అభిమానుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా తెగ లైకులు వచ్చేస్తున్నాయి. రోజా చేస్తున్న వంటలకు వారంతా ఫిదా అవుతున్నారు. వారం రోజుల క్రితం చికెన్ ముట్టీస్ అనే వంటకాన్ని తన పిల్లలకోసం వండి పెట్టిన రోజా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రోజా చేసిన ఈ వంటకాన్ని అభిమానులు సైతం తమ ఇంట్లో ట్రై చేస్తామంటూ కామెంట్స్ పోస్టు చేశారు.

నోరూరించే రోజా ఆవకాయ పచ్చడి రెడీ

తాజాగా ఎమ్మెల్యే రోజా నోరూరించే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెబుతూ వీడియోను పోస్టు చేశారు. మామిడికాయలను కట్ చేయడం దగ్గర నుంచి దాన్ని తయారు చేసే పద్దతి స్పష్టంగా వివరిస్తూ ఉన్న వీడియోను రోజా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు, సామాన్య ప్రజలు సూపర్ రోజాగారు అంటూ కామెంట్ చేశారు. ఆవకాయ పచ్చడి చేసే విధానం చూస్తుంటేనే నోరూరుతోందంటూ కొందరు కామెంట్ చేయగా... మరికొందరు మాత్రం రోజా భర్త సెల్వమణి చాలా లక్కీ అంటూ కామెంట్ చేశారు. రోజా గారి చేతి వంట సూపర్‌గా ఉంటుందని గతంలో కొందరు నాయకులు కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే.

మొత్తానికి ఓవైపు ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గపు ప్రజలకు.. మరోవైపు ఒక సాధారణ గృహిణిలా ఇంట్లో కుటుంబసభ్యులకు నచ్చిన వంటలు చేసి వడ్డించడంలో ఎంతో సంతృప్తినిస్తోందని రోజా చెప్పుకొచ్చారు. ఇక లాక్‌డౌన్‌తో బుల్లితెర షూటింగులు కూడా లేకపోవడంతో చాలావరకు సమయాన్ని తన సొంత నియోజకవర్గంలో గడుపుతున్న రోజా... అదే సమయంలో కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయం గడుపుతున్నారు.

English summary
YCP MLA Roja is always in news for her work. Now Roja is making news for posting the videos on social media of she cooking recepies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X