తెలంగాణలో వైసిపి మరో కేసు: చంద్రబాబు.. ఆ మీడియా అధినేత పై ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి!
వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చెప్పినట్లుగానే కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృ ష్ణ..ఏపి సీయం చంద్రబాబు పై జూబ్లీహిల్స్ లో ఫిర్యాదు చేసారు. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి తన ప్రతిష్ఠను ..పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని ఆరోపించారు.

సాయి రెడ్డి ఆడియో అంటూ ప్రచారం
వైసిపి నేత విజయ సాయి రెడ్డి పార్టీ నేతలతో మాట్లాడిన వీడియో అంటూ ఏబిఎన్ ఛానల్ ఓ ఆడియోను ప్రసారం చే సింది. ఆ వీడియో లో సాయిరెడ్డి ఏపి ప్రజల పై అనుచిత వ్యాఖ్యలు చేసారని..వైసిపి అధినేత జగన్ పైనా కొన్ని వ్యా ఖ్యలు చేసారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేయటంలో భాగంగా సాయి రెడ్డి పార్టీ నేతలతో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందంటూ ఏబిఎన్ తన కధనంలో పేర్కొంది. అందులో తెలంగాన ప్రజ లకు నిబద్దత ఉందని..ఏపి ప్రజలు కులాల్లో మునిగిపోయారంటూ వ్యాఖ్యానించినట్లు ఉంది. అయితే, దీని పై వైసిపి ఎంపి విజయ సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. అది తన వాయిస్ కాదని.. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని చెప్పారు. దీని పై కేసు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో..ఆంధ్రజ్యోతి పత్రిక లోనూ దీని పై కధనం ఇచ్చింది . తాము ఢిల్లీలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలనకు పంపామని.. అందులో సాయిరెడ్డి తే ఆ వాయిస్ అని తేలిందని ఆంధ్ర జ్యోతి చెప్పుకొచ్చింది.

జూబ్లీహిల్స్ లో కేసు నమోదు..
సాయి రెడ్డి తన పై ప్రసారమైన కధనాల ను ప్రస్తావిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఫిర్యాదు చేశా రు. తన వాయిస్‌ని డబ్బింగ్ చేసి తన ప్రతిష్ట తో పాటుగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏబీఎన్ ఛానల్‌లో కథనాలు వండివార్చారని సాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుండటం తో జూబ్లీహిల్స్ పోలీసులు బదలాయించినట్లు చెబుతున్నారు. విజయసాయి రెడ్డి తరపున వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ చల్లా మధుసూదన్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ఛానల్‌లో టెలికాస్ట్ చేసిన ఆడియో, వీడియో, డిబేట్ వీడియోలను సాక్ష్యాలుగా ఫిర్యాదుదారుడు పోలీసులకు అందచేసారు . రాధాకృష్ణతో పాటు దీని వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్దించారు.












Click it and Unblock the Notifications