వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు: జగన్ కేసులపై భూమన

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వార్థ ప్రయోజనాలకు కేంద్రంతో లాలూచీ పడి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని ఆయన విమర్శించారు. విభజన సమయంలో చంద్రబాబు రెండు కల్ల సిద్ధాంతాన్ని ప్రజలంతా గమనించారని ఆయన అన్నారు.

టిడిపి విభజనను సమర్థించింది....

టిడిపి విభజనను సమర్థించింది....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చనప్పటికీ టిడిపి విభజనను సమర్థించిందని విజయసాయి రెడ్డి అన్నారు. తెలుగుజాతికి టిడిపి ద్రోహం చేసిందని మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పార్లమెంటులో పోరాటం చేస్తోందని అన్నారు.

ప్రత్యేక హోదా మా పేటెంట్

ప్రత్యేక హోదా మా పేటెంట్

ప్రత్యేక హోదా అనేది తమ పేటెంట్ అని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను చంద్రబాబు సమర్థించారని, తాము మాత్రం వ్యతిరేకించామని చెప్పారు. తాము పెట్టే అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు తెలియజేయకుండా తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.

జగన్ ఏ తప్పూ చేయలేదు

జగన్ ఏ తప్పూ చేయలేదు

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏ విధమైన తప్పు కూడా చేయలేదని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ, చంద్రబాబు కుమ్మక్కయి ఉద్దేశ్యపూర్వకంగా పెట్టింిన కేసులన్నింటినీ కచ్చితంగా కొట్టేస్తారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు.

ఆ విషయాలను ప్రస్తావించడం...

ఆ విషయాలను ప్రస్తావించడం...

జగన్‌పై కేసులు కొట్టేస్తారేమోనని చంద్రబాబు అనడాన్ని, దాన్ని ఓ పత్రిక పతాక శీర్షికన ప్రచురించడాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగ అభియోగాలు మోపుతూ జగన్‌పైపెట్టిన కేసులను న్యాయస్థాలను కచ్చితంగా కొట్టేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని అన్నారు.

వారికి అలా ఉండవచ్చు....

వారికి అలా ఉండవచ్చు....

చట్టంపై నమ్మకం లేని చంద్రబాబుకు, ఆయన మంత్రిమండలికి, ఆయన తైనాతీలకు జగన్‌పై పెట్టిన కేసుల మీద అనుమానాలు ఉండవచ్చు గానీ తమకు చట్టం మీద, న్యాయం మీద అపారమైన వి్వాసం ఉందని భూమన అన్నారు. అందుకే ఈ కేసులపై విచారణ చేస్తున్న న్యాయస్థానాలు వాస్తవాలను నిగ్గు తేలుస్తాయనే నమ్మకం తమకు ఉందని అన్నరు.

రాజకీయంగా ఎదుర్కోలేకనే...

రాజకీయంగా ఎదుర్కోలేకనే...

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రెండున్నర దశాబ్దాలుగా శత్రువు చూసిన కాంగ్రెసుతో కూడా చంద్రబాబు చేతులు కలుపుతున్నారని భూమన అన్నారు. తనను ధిక్కరించారని సోనియాయ గాంధీ రగిలిపోతుంటే దానికి ఆజ్యం పోసింది టిడిపి కాదా అని ఆయన ప్రశ్నిించారు. చంద్రబాబు ఎంత కాలం అబద్ధం శవపేటికను మోస్తారని ఆయన అడిగారు.

English summary
The YSR Congress party MPVijaya Sai reddy made controversial statement on Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chnadrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X