సైరా పంచ్... విజయసాయి నిప్పు పప్పు ఉప్పు ట్వీట్... ఆ ముగ్గురే టార్గెట్ 

ఏపీలో ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. ఒకరిమీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాను సైతం తమదైన శైలిలో వాడుతున్నారు. మొదటి నుంచి ట్విట్టర్ వేదికగా అధికార టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు మీద, చినబాబు నారా లోకేష్ మీద సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరే కాకుండా ఇప్పుడు ఈ ఖాతాలో పవన్ కళ్యాణ్ కూడా చేరారు.

విజయసాయి సైరా పంచ్.. వైరల్ అవుతున్న ట్వీట్

విజయసాయి సైరా పంచ్.. వైరల్ అవుతున్న ట్వీట్

తాజాగా సైరా పంచ్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వాడి వేడి చర్చకు కారణమవుతుంది.

మొదటినుంచి చిట్టి నాయుడు అంటూ నారా లోకేష్ పై సెటైర్లు వేసే విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు, లోకేష్, పవన్ ల ఫోటోలను పెట్టి ఒక ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

నిప్పు, పప్పు, ఉప్పు ట్వీట్... చంద్రబాబు , లోకేష్ , పవన్ లే టార్గెట్

నిప్పు, పప్పు, ఉప్పు ట్వీట్... చంద్రబాబు , లోకేష్ , పవన్ లే టార్గెట్

ఇక ట్వీట్ ఏంటంటే చంద్రబాబు నివురుగప్పిన నిప్పు అట.. లోకేష్ నిప్పు కొడుకు ముద్దపప్పు అట, ఇక పవన్ తినేది పార్టనర్ (అదే చంద్రబాబు)ఉప్పు' అట.. అంతేనా వీళ్లను నమ్మటం తప్పు అని, వీళ్ళు రాష్ట్రానికి పెనుముప్పు అని విజయసాయి రెడ్డి ఫోటోలతో పాటు గా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 చిట్టినాయుడి పసి మెదడుకు లాజిక్ అర్ధం కాదని ట్వీట్

చిట్టినాయుడి పసి మెదడుకు లాజిక్ అర్ధం కాదని ట్వీట్

ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుండి విజయ సాయి రెడ్డి చంద్రబాబు పై, నారా లోకేష్ పై ట్వీట్ల ద్వారా నే దాడికి దిగుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు శరపరంపరగా ఆయన చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. మొన్నటికి మొన్న వచ్చే నాలుగు రోజుల్లో 20 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారానికి లోకేష్ ఉబలాట పడ్డాడని, అయితే అక్కడ అభ్యర్థులు బాబు మా తంటా మేం పడతాం, మీరు మంగళగిరి చూసుకోండి చాలు అని చెప్పారని, పాపం చిట్టినాయుడు పసి మెదడుకు ఏ లాజిక్ అర్థం కావడం లేదని సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.

ట్విట్టర్ వేదికగా ఆ ముగ్గురిపై విజయసాయి విమర్శనాస్త్రాలు

ట్విట్టర్ వేదికగా ఆ ముగ్గురిపై విజయసాయి విమర్శనాస్త్రాలు

ఇలా చెప్పుకుంటూ పోతే మొదటి నుండి ట్విట్టర్ వేదికగా విజయ సాయి రెడ్డి చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా నిప్పు, పప్పు, ఉప్పు, తప్పు, ముప్పు అంటూ కవిత్వాత్మకంగా వేసిన సెటైర్ వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+