విమానంలో వెకిలి చేష్టలు-విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి అరెస్ట్
మస్కట్ నుంచి గన్నవరం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న విమానంలో ఓ మహిళను వేధించిన ప్రయాణికుడిని విజయవాడ ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది గన్నవరం పోలీసులకు అప్పగించారు.
మస్కట్ నుంచి బయలుదేరిన విమానంలో తనతో కలిసి పక్క సీట్లో ప్రయాణిస్తున్న ఓ మహిళను లక్ష్మణ్ అనే ప్రయాణికుడు గమనించాడు. విమానం టేకాఫ్ కాగానే ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తనను శారీరకంగా కూడా హింసించాడు. దీంతో విమానం గన్నవరం చేరుకునే వరకూ వేచి చూసిన ఆమె... ల్యాండింగ్ కాగానే భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఫిర్యాదు చేసిన అంశాల ఆధారంగా ప్రాధమికంగా లక్ష్మణ్ ను విచారించి గన్నవరం పోలీసులకు అప్పగించారు.

మస్కట్-హైదరాబాద్ విమానంలో తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురైన మహిళను హైదరాబాద్ కు చెందిన అరుణగా గుర్తించారు. ఆమె విమానంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గన్నవరం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పీఎస్ లో నిందితుడు లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications