బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి భారీ ఆదాయం...

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రీపై వెల‌సిన క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి భారీ ఆదాయం స‌మ‌కూరింది. దుర్గ‌మాత‌ను ద‌ర్శించుకునేందుకు నిత్యం ఇక్క‌డికి భ‌క్తుల‌కు వ‌స్తుంటారు. అయితే, భ‌క్తులు త‌మ మొక్కుల‌ను కానుక‌ల రూపంలో స‌మ‌ర్పిస్తుంటారు. నిన్న (గురువారం) ఆల‌యంలో భక్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల్ని ఆల‌య అధికారులు లెక్కించారు. మొత్తం 18 రోజుల‌కు గాను రూ.2,76,66,261 ఆదాయం వచ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. వీటితోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా హుండీలో ఉన్న‌ట్లు అధికారులు వివ‌రించారు.

సగటున రోజుకు అమ్మ‌వారి హుండీ ఆదాయం రూ.15,37,014గా ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. న‌గ‌దుతోపాటు అమ్మవారికి కానుకల రూపంలో హుండీలలో 523 గ్రాముల బంగారం కూడా ఉంది. అలాగే, 7 కిలోల 30 గ్రాముల వెండి కూడా అమ్మ‌వారి హుండీలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Vijayawada Kanakadurgamma temple has huge income

యూఎస్‌ఏ డాలర్లు 327, ఖతార్ రియాల్స్‌ 98, ఆస్ట్రేలియా డాలర్లు 35, యూరోలు 25, సింగపూర్‌ డాలర్లు 10, ఇంగ్లాండ్‌ పౌండ్లు 10, కెనడా డాలర్లు 5, సౌదీ రియాల్స్‌ 5, కువైట్‌ దినార్లు 2, మలేషియా రింగ్గిట్స్‌ 1 ఉన్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. ఆల‌యంలోని అమ్మ‌వారి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు రూ.61,260లుగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక‌, విజయవాడకు చెందిన ఓ భక్తుడు క‌న‌క‌ దుర్గమ్మ ఆలయంలో అన్నదానానికి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయ‌న ఓ చెక్కును కూడా అంద‌జేసారు.

ల‌క్ష రూపాయ‌ల విరాళం...

ఇదిలా ఉండ‌గా, క‌నక‌దుర్గ‌మ్మ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జసిస్టస్‌ శ్రీసుధ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆ దంపతులుకు ఆలయ మర్యాదలు కల్పించారు. అమ్మవారి దర్శనం అనంత‌రం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు, అమ్మవారి చిత్రపటం వంటివి అందజేశారు. ఇక‌, విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఓ వ్య‌క్తి అమ్మవారి ఆల‌యంలోని అన్న విత‌ర‌ణ‌కు ఏ దినేష్‌ పేరిట రూ.1,00,000లు చెక్కు రూపంలో విరాళంగా అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+