ప్రేమ వ్యవహారంలో మైనర్ బాలికపై అంత అమానుషమా..? పెద్దమనుషులు పబ్లిక్‌గా ఏంటీపని..?
తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఆ ప్రేమజంట పది రోజుల క్రితం ఊరి విడిచి వెళ్లిపోయారు . ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో ఆ ప్రేమ జంటను ఏమీ అనమని చెప్పి గ్రామానికి పిలిచి పంచాయితీ పెట్టారు. మైనర్ కావడంతో వారు చేస్తుంది తప్పు అని చెప్పడం వరకు సమంజసమే అయినా..పంచాయితీలో గ్రామపెద్దలు ఆగ్రహానికి గురై ప్రవర్తించిన తీరు మాత్రం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది.

అనంతపురం జిల్లాలో ఆటవిక చర్య .. మైనర్ల ప్రేమపై రెచ్చిపోయిన పంచాయితీ పెద్ద
తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఇటువంటి ఆటవిక సమాజంలో ఉంటున్నామా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పట్టపగలు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా జరిగిన దారుణం వివరాల్లోకి వెళితే అనంతపురంలో నేటికీ కట్టుబాట్ల పేరుతో ఆటవికత రాజ్యమేలుతోంది . తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో తప్పుచేసిన ప్రేమికుల జంట వ్యవహారంపై కేపీ దొడ్డి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు .ప్రేమించడం నేరంగా భావించడంతోపాటు, యువకుడికి ,యువతి వరుస కాకపోవడంతో మరింత రెచ్చిపోయిన గ్రామపెద్దలు దాడికి దిగారు.

ఏడుస్తున్నా వదలకుండా బాలికను చిత్రహింసలకు గురి చేసిన పెద్ద .. చోద్యం చూసిన గ్రామస్తులు
మైనర్ బాలికపై విచక్షణారహితంగా దాడి చేసిన గ్రామపెద్ద చిన్న పిల్ల అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదారు.ఊరి జనం అందరిముందు ఓ ఆడపిల్ల పై ఇంత అమానుషం జరుగుతున్నా ఎవరు ఇదేంటి అని ప్రశ్నించలేదు. పైగా దెబ్బలు తాళలేక పడిపోయిన యువతిని పైకి లేపి కూర్చోబెట్టి మరి కొట్టించారు. ఇక బాలిక విషయం లో రెచ్చిపోయిన సదరు పంచాయతీ పెద్ద ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. బాలిక గుండెలపై కాళ్లతో తన్నాడు, పెద్ద కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. జుట్టు పట్టుకుని అటూ ఇటూ ఈడ్చాడు. అత్యంత అమానవీయంగా అందరూ చూస్తుండగా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. బాలిక హాహాకారాలు చేస్తున్నా విడిచిపెట్టకుండా గొడ్డును బాదినట్టు బాదాడు.

బాలిక తండ్రిపైనా, యువకుడిపైనా ప్రతాపం ... సోషల్ మీడియాలో మొత్తం ఘటన వైరల్
ప్రేమించుకున్న పాపానికి ఇద్దరు మైనర్లపై పంచాయితీలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప చెలరేగిపోయాడు. పెద్దల మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అంటూ రెచ్చిపోయిన పెద్ద బాలిక తండ్రి పైన , యువకుడిపైన కూడా తన ప్రతాపం చూపించాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా సినిమా చూసినట్టు చూశారే తప్ప ఏ ఒక్కరూ లింగప్ప ను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ కొనసాగుతున్న అమానవీయ, ఆటవిక సంఘటన వెలుగు చూసింది. అయితే పోలీసులు ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని తమ దృష్టికి వస్తే మాత్రం తప్పక విచారణ చేస్తామని చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications