నటి విమలారామన్ సరదాగా వయ్యారాలు (పిక్చర్స్)
హైదరాబాద్: తమిళ భామ విమలా రామన్ మళ్లీ సినిమల్లోకి అడుగు పెడుతోంది. ఇప్పటి వరకు అత్యంత సీరియస్‌గా భరతనాట్యం నేర్చుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నానంటూ సందడి చేస్తోంది.
శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొంది సినిమాలో స్టెప్పులేసిన ఈ భామామణి భానుప్రియ, శోభన అడుగుజాడల్లో నడిచింది. తాజాగా బుధవారంనాడు ఆమె ట్రెంజ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె తన భవిష్యత్తు కార్యక్రమాల గురించి మాట్లాడింది.
సిడ్నీ వెళ్లి గజ్జె కట్టి నాట్యమాడిన విమలారామన్ సిడ్నీ టు హైదరాబాద్ పర్యటన విశేషాలను వినసొంపుగా చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఆమెకు సినిమాలే ప్రపంచమని ముద్దు ముద్దుగా చెప్పింది.

వయ్యారి వగలమారి..
నటి విమలా రామన్ ట్రెంజ్ లైఫ్ స్టయిల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తర్వాత ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వయ్యారాలు ఒలకబోసింది.

ప్రదర్శన ప్రారంభం..
తాజ్‌కృష్ణాలో ట్రెంజ్ లైఫ్ స్టయిల్ ప్రదర్శనను విమలా రామన్ బుధవారంనాడు ప్రారంభించి, సందడి చేసింది.

సంప్రదాయాల ప్రతిబింబం..
రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో ప్రదర్శించే ఈ ఉత్పత్తులు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పిందీ సుందరి విమలా రామన్.

సంప్రదాయ దుస్తులు కూడా..
సంప్రదాయ నాట్యమే కాదు, సంప్రదాయ దుస్తులంటే కూడా తనకు ఎంతో మక్కువ అని విమలా రామన్ చెప్పింది.

సరదాగా
ప్రస్తుతం సరదాగా అనే తెలుగు సినిమాలోనే కాకుండా మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు విమలా రామన్ చెప్పింది.

నాట్యమే ప్రపంచం..
ఇంత కాలం నాట్యమే ప్రపంచంగా జీవించానని, ఇప్పుడు సినిమాలో ప్రపంచమని విమలా రామన్ తన ఉద్దేశ్యాన్ని వెల్లడించింది.

అస్ట్రేలియాలో భరత నాట్యం
ఆస్ట్రేలియాలో భరత నాట్యం శిక్షణ పొందానని, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించానని విమలా రామన్ తన జీవన యానం గురించి వివరించింది.












Click it and Unblock the Notifications