Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారు డ్రైవర్ హత్యలో అనూహ్య పరిణామం- జనసేన సంచలన నిర్ణయం

శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అయిదుమందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. రెండు వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించారు.

Vinutha Kota expelled from the Janasena

శ్రీనివాసులు తమకు ద్రోహం చేసిన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కిందటి నెల 21వ తేదీన కోట వినూత వెల్లడించారు. ఇకపై అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురి కావడం, చెన్నై సమీపంలో అతని మృతదేశం లభించడం సంచలనంగా మారింది.

చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా తెలుస్తోంది.

ఈ హత్య కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో జనసేన పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. కోట వినూతను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జీగా ఉన్న వినుత కోటను కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు తెలిపారు. ఆమె వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున ఆమెను పార్టీకి దూరంగా ఉంచామని వివరించారు. వినుతపై హత్యకేసు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, ఆమెను పార్టీనుంచి బహిష్కరించినట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+