Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ అబ్బాయి - నార్వే అమ్మాయి లవ్ స్టోరీ.. సినిమా లెవెల్ లో ఉందిగా !!

ప్రేమ.. హృదయాన్ని తాకే ఆ అందమైన అనుభూతిని మాటల్లో చెప్పడం అంటే కష్టమే. రెండు మనసులను కలిపే ఒక మధురమైన బంధమే లవ్. అటువంటి ప్రేమకు భాష లేదు, సరిహద్దు లేదు.. వయస్సు అనే తేడా ఉండదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రేమతోనే మనం ముందుకు వెళ్తాం. అందుకే ప్రేమకు దేశాలు, భాషలు, సంస్కృతి, ఖండాలే అడ్డుకావని మరోసారి రుజువైంది.

విశాఖపట్నం యువకుడు - నార్వే యువతి మధ్య పుట్టిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి.. సప్త సముద్రాల అవతల దాటి అతని కోసం వచ్చింది. వరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో విశాఖలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది.

visakhapatnam-boy-norway-girl-love-story-got-viral-on-media

అసలేం జరిగిందంటే..

విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు.. అక్కడ అమ్మాయితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం ఇటీవల జరుగుతూనే ఉంటుంది. అలాంటి ప్రేమకథల్లో విశాఖపట్నానికి చెందిన సైమన్ ది కూడా ఒకటి. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఉద్యోగ అవకాశాల కోసం నార్వేకు వెళ్లిన సైమన్.. 2016 నుంచి అక్కడి ఒక ప్రముఖ బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదే సమయంలో రెండేళ్ల క్రితం ఆయన పనిచేస్తున్న సంస్థలో నిర్వహించిన మ్యూజిక్ క్విజ్ పోటీ సైమన్ జీవితాన్ని మలుపు తిప్పింది.

ఆ పోటీలోనే నార్వేకు చెందిన తూరా అనే యువతిని సైమన్ కలుసుకున్నాడు. స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న తూరా, సైమన్ ఇద్దరి మధ్య మొదట స్నేహం ఏర్పడింది. మ్యూజిక్, ట్రావెల్, కల్చర్‌లపై ఉన్న ఉమ్మడి ఆసక్తులు వారిని మరింత దగ్గర చేశాయి. క్రమంగా ఆ స్నేహం గాఢమైన ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయగా, పెద్దలు ఎంతో విశాల మనసుతో అంగీకరించారు.

వైభవంగా నిశ్చితార్ధం..

దీంతో నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు కాగా, నార్వే నుంచి తూరా తల్లిదండ్రులు విశాఖకు వచ్చారు. విశాఖలో సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ ఆతిథ్య సంప్రదాయం, కుటుంబ సభ్యుల ఆప్యాయత చూసి తూరా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్ మాట్లాడుతూ, "మన కుటుంబానికి కొత్తగా వచ్చిన అమ్మాయి మన సంప్రదాయాన్ని కూడా ప్రేమతో స్వీకరించడం సంతోషంగా ఉంది అన్నారు. మొత్తానికి విశాఖ యువకుడు - నార్వే యువతి ప్రేమ ప్రయాణం ఇప్పుడు అనేక మందికి ప్రేరణగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+