వీడియో: ఏపీలో వింత ఘటన- చెట్టు నరుకుతుండగా

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చెట్టును నరుకుతుండగా.. అందులో నుంచి పాతాళ గంగమ్మ ఉబికి వచ్చింది. ధారాపాతంగా నీళ్లు ఉప్పొంగాయి. ఈ విషయం తెలిసిన వెంటనే తండోపతండాలుగా జనం ఆ చెట్టుకు వద్దకు చేరుకున్నారు. పాతాళ గంగమ్మ కరుణించిందంటూ పూజలు చేశారు.

జిల్లాలోని అర్ధవీడు మండలంలో ఈ ఉదయం ఈ సంఘటన సంభవించింది. అర్ధవీడు మండలంలోని పోతురాజుటూరు గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు చెట్టును నరుకుతుండగా.. అందులో నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ప్రకాశం-నంద్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది ఈ మండలం. చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉంటాయి.

Andhra Pradesh

పోతురాజుటూరు సమీపంలోని అడవుల్లో చెట్లను నరికి టింబర్ డిపోలకు తరలిస్తుంటారు స్థానిక వ్యాపారులు. ఈ క్రమంలో కొందరు కూలీలు చెట్లను నరకడానికి అడవుల్లోకి వెళ్లారు. ఓ చెట్టును సగం నరికిన తరువాత అందులో నుంచి ఏకధాటిగా నీళ్లు పొంగుకొచ్చాయి. వెంటనే దీన్ని తమ మొబైల్ ఫోన్లల్లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Andhra Pradesh

ఈ సమాచారం తెలిసిన వెంటనే పోతురాజుటూరు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. వారిలో కొందరు ఆ నీటిని రుచి చూశారు. మంచినీళ్లలా అనిపించడంతో దోసిళ్లతో పట్టుకుని మరీ తాగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీన్ని ట్రీ బ్లీడింగ్‌గా పిలుస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+