వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో బలంగా ఉన్నాం, వారిలా గాలికి వదిలేయం!: కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodela Siva Prasad
విజయవాడ/గుంటూరు: తెలంగాణలో తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, అలాంటి ప్రాంతాన్ని తాము వదులుకునే ప్రసక్తి లేదని, ఇతర పార్టీల్లా తాము తెలంగాణను గాలికి వదిలేయలేమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ గురువారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యం ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తాము తెలంగాణను వదిలేయకుండా సమైక్యం వైపు మొగ్గేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. తెలంగాణను వదులుకోమన్నారు. తమ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు తమ పైన విమర్శలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అవి కడుపు మండిన మాటలు అన్నారు. 80 శాతం మంది సమైక్యం కోరుకుంటున్నారని, విడిపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా బాధపడతారన్నారు. విభజనపై టిడిపి ఇరకాటంలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమన్యాయం లేదా సమైక్యం తమ డిమాండ్ అన్నారు.

కేంద్రమంత్రులు అమ్ముడుపోయారు: సోమిరెడ్డి

కేంద్రమంత్రులు, ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా విమర్శించారు. రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వంద రోజుల సమైక్య ఉద్యమం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్‌లో వందమందితో సోమిరెడ్డి రిలే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు సీమాంధ్రలో పోరాటం ఆగదని సోమిరెడ్డి హెచ్చరించారు.

సోనియా ఆదేశాల మేరకే: వర్ల

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే వైయస్ జగన్ సమైక్య ముసుగులో విభజనకు సహకరిస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే రోడ్ల దిగ్బంధమన్నారు. సమైక్యంపై చిత్తశుద్ధి ఉంటే సోనియా ఇంట ముందు ధర్నా చేయాలన్నారు.

English summary
Telugudesam Party senior leader and former minister Kodela Siva Prasad on Thursday said they have strongcadre in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X