వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకు: టిపై పయ్యావుల, గాడిద మెడలో చిరు ఫ్లెక్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాము భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సోమవారం చెప్పారు. నవంబర్ 1లోగా తాము సుప్రీంలో పిటిషన్ వేస్తామన్నారు. దశల వారీగా దాఖలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం తాము వ్యక్తిగతంగానే పిటిషన్ దాఖలు చేస్తున్నామని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. విభజనపై ఢిల్లీలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.

డిగ్గీని ఎవరు నమ్మరు: పాలడుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాటలను ఎవరు నమ్మరని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు ధ్వజమెత్తారు. దిగ్విజయ్ ఓ అబద్దాలకోరు అన్నారు. సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు పదవుల కోసమే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను వారు అడ్డుకోలేకపోయారన్నారు.

సాయిప్రతాప్ రాజీనామా

సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి, ఎంపి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు.

గాడిదలకు ఫ్లెక్సీలు

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో పలువురు సమైక్యవాదులు కాంగ్రెసు పార్టీ నేతల చిత్రపటాలను గాడిదలకు కట్టి ఊరేగించారు. విభజనకు కారకులంటూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, విభజనను అడ్డుకోలేక పోయారంటూ కేంద్రమంత్రి చిరంజీవి తదితరుల చిత్రాలను గాడిదల మెడల్లో కట్టారు.

English summary

 Telugudesam Party senior leader Payyavula Keshav on Monday said they will approach Supreme Court over AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X