వరుసగా సంతకాలు చేస్తున్న ఆ హీరో ఎవరు? ఎందుకు చేస్తున్నారు?

డబ్బులు బాగా అవసరపడిన ఆ హీరో ఎవరు? ఎందుకు వరుసగా చిత్రాలు చేస్తున్నారు? ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో రెండు మూడు సినిమాలకు కొబ్బరికాయ కొడుతున్నారు. ఏడాదికి ఒక సినిమా చేయడమే బంగారం అన్నట్లుగా భావించే పరిస్థితి నుంచి వరుసబెట్టి సినిమాలు చేయడానికి కారణం ఏమిటి? అనే చర్చ తెలుగు ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది.

హీరోయిన్లు తాము మంచి ఫాంలో ఉన్నప్పుడు చకచకా సినిమాలకు సంతకాలు చేసేస్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. హీరోలు ఉన్నట్లుగా హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండటానికి వీలవదు. దీంతో వాణిజ్య ప్రకటనలతోపాటు ప్రత్యేక గీతాలకు కూడా ఓకే చెప్పేస్తారు. ఫాంలో ఉన్నప్పుడే ప్రత్యేక గీతానికైనా బాగా డబ్బులు వస్తాయి కాబట్టి నటించేస్తుంటారు.

who is that star hero in tollywood

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కథానాయకుడు కమిట్ అవుతున్న విధానం చూస్తే అచ్చం ఇలాగే ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ హీరో సినిమాల వేగం పెంచారు. ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే కొత్తవి కూడా తెరకెక్కుతున్నాయి. విడుదలనేది తర్వాత.. ముందు సినిమాను ఒప్పుకున్నామా? అడ్వాన్స్ చేతికి అందిందా? లేదా? అనేదే ముఖ్యమవుతోందంటున్నారు.

వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు బాగా అవసరపడుతుండటంతో సినిమాలకు వరుసగా కమిట్ అవ్వాల్సి వస్తోందంటున్నారు. ఈ సినిమాలద్వారా తనకేదో వస్తుందని, అభిమానులు సంతోష పడతారని కొత్త సినిమాలకు సంతకాలు చేయడంలేదు. కేవలం డబ్బులు అవసరం ఉండటంవల్లే కొత్త ప్రాజెక్టులు తెరపైకి వస్తున్నాయి. పాత సినిమాలు కొన్ని మూలనపడి మూలుగుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎవరికీ అర్థం కావడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+