kriti shetty: కృతిశెట్టిని విసిగిస్తున్న స్టార్ హీరో కొడుకు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత చిన్న వయసు కలిగిన హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ అమ్ముడు మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు కొన్ని ఆశించిన ఫలితాలివ్వలేదు. దీంతో ఆమె ఇండస్ట్రీలో కాస్తంత డల్ అయింది . ఈ తరుణంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించి విజయాల బాట పట్టింది. మళ్లీ ఈ సినిమాల తర్వాత కృతిశెట్టి నటించిన సినిమాలు విజయం సాధించలేకపోయాయి.
టాలీవుడ్ లో హిట్ సినిమాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడ సూర్య, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది. కోలీవుడ్ లో కూడా నెమ్మది నెమ్మదిగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇదిలావుండగా ఓ స్టార్ హీరో కొడుకు నుంచి కృతికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. కృతితో స్నేహం చేయాలని చూస్తుంటే.. ఈమెకు మాత్రం అస్సలు ఇష్టం లేదట.

కృతి ఎక్కడికి వెళ్లినా ఆ హీరో కొడుకు కూడా ఆమె వెంటే వెళ్తూ విసిగిస్తున్నాడట. ఆ వ్యక్తి పుట్టిన రోజు ఉండటంతో కృతిశెట్టిని షూటింగ్ వదులుకొని రావాలని బలవంతం చేశాడట. నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని.. నా పుట్టిన రోజుకి రావాలంటూ ఫోన్ చేశాడని, అలా ప్రతిరోజు తనతో ఉండాలని ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. కృతిశెట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications