సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ...వైసిపిలోకి వెళతారా?...ఎందుకు?

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గురించిన చర్చ ఇప్పుడు గుంటూరు జిల్లాలో అన్ని పొలిటికల్ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆయన త్వరలో వైసిపి లోకి వెళుతున్నారనే ప్రచారం ఈమధ్యకాలంలో బాగా జోరందుకోవడమే...కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగి ప్రస్తుతం బిజెపిలో ఉన్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ నిజంగానే వైసిపిలో చేరే అవకాశం ఉందా?...

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు...కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కన్నాతమ పార్టీలో చేరితే ఆయనకు కలిగే లాభాలంటూ వైసిపి పార్టీ కొన్ని ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచిందట. అందులో కన్నా బాగా కోరుకునే ఆప్షన్ కూడా ఉందట...ఇప్పుడు ఆ ఆప్షన్ ను బట్టే ఆయన ఆ పార్టీలో చేరే విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఆప్షన్ ఏంటో...కన్నా ఆలోచనా తీరేంటో తెలసుకోవాలంటే చదవండి మరి...

కన్నా లక్ష్మీనారాయణ...గుంటూరు జిల్లాలో గట్టి నేత...

కన్నా లక్ష్మీనారాయణ...గుంటూరు జిల్లాలో గట్టి నేత...

కాంగ్రెస్ పార్టీ తరుపున పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచి...2004 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంవత్సరాలు కీలక పాత్ర పోషించడంతో పాటు గుంటూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు చక్రం తిప్పారు. అలాంటి బలమైన నేత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపునే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి గుంటూరు ఎంపి...ప్రస్తుతం నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుతో ఉన్న బలమైన వైరం కారణంగా బిజెపిలో చేరారు. వైఎస్ ను అమితంగా అభిమానించే కన్నా వైసిపిలో చేరుతారని అందరూ భావించారు. కానీ కన్నా బిజెపిని ఎంచుకున్నారు. కారణం...తన ప్రత్యర్థి రాయపాటి టిడిపిలో చేరడం ఒక కారణమైతే రెండు టిడిపి, చంద్రబాబుతో కన్నా లక్ష్మీనారాయణ వైరం వ్యక్తిగత స్థాయిలో ఉండటం...అందువల్ల టిడిపిలో చేరలేని పరిస్థితుల్లో...అలాగని ఆ పార్టీ నుంచి ఇబ్బందులు ఎదర్కోకుండా ఉండటం కోసం బిజెపిలో చేరారు.

మరి ఇప్పుడు...వైసిపి చేరతారా?...

మరి ఇప్పుడు...వైసిపి చేరతారా?...

కాపు సామాజిక వర్గానికి బలమైన నేత కన్నా లక్ష్మీ నారాయణ మరి ఇప్పుడు వైసిపిలో చేరతారా?...ఆ అవకాశం ఉందా?...అంటే ఉందనే చెప్పుకోవాలి...
గతంలో కన్నా వైసిపిలో చేరకపోవడానికి ఆ పార్టీకి అప్పుడు ఉన్న అవినీతి పార్టీ ఇమేజ్ ప్రధాన అడ్డంకిగా చెప్పుకోవచ్చు. అలాగే వైసిపిలో చేరితే తాను వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగతంగా భక్తి కూడా ఎక్కువే. తన సేఫ్టీతో పాటు ఆధ్యాత్మిక కారణాలతో కూడా కన్నాఅప్పుడు బిజెపిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 వైసిపిలో చేరితే ఎందుకు?...ఎందుకంటే?...

వైసిపిలో చేరితే ఎందుకు?...ఎందుకంటే?...

అయితే మరి ఇప్పుడు వైసిపిలో చేరడానికి ఎందుకు మొగ్గు చూపొచ్చంటే...మారిన రాజకీయ పరిస్థితులతో పాటు...సుదీర్ఘకాలం ఛరిష్మాతో వెలిగిన ఆ నేత అనామకంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయారనే చెప్పుకోవచ్చు.కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించిన కన్నా పేరు ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి సైతం బలంగా వినిపించింది...కాబట్టే మళ్లీ తాను ఏక్టివ్ పాత్ర పోషించాలంటే ఎక్కడ సాధ్యపడుతుందో అక్కడ ఉండాలని కన్నా నిర్ణయించుకున్నట్లు అది ఆయన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం చాలా కష్టమనేది నానుడి...ఆ చందంగానే సుదీర్ఘకాలం ఎంతో ఘనమైన...గత చరిత్ర కలిగిన...కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కన్నా లక్ష్మీనారాయణ సమకాలీన రాజకీయాల్లో తాను మళ్లీ చక్రం తిప్పాలనే పట్టుదలతో వైసిపిలోకి రావడానికి సిద్దపడివుండొచ్చు.

 కన్నా పార్టీ ఎందుకు మారతారు....మారే అవకాశం ఉందా?...

కన్నా పార్టీ ఎందుకు మారతారు....మారే అవకాశం ఉందా?...

గుంటూరు జిల్లాలోని అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం తరుపున ఆల్రెడీ ఒకసారి ప్రాతినిథ్యం వహించిన కన్నా...రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ఇమేజ్ ఎపిలో అతి దారుణంగా పడిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథ నేతలే కాడి కిందపడేసి పోటీచేయకుండా ఆగిపోగా...కన్నా మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపునే పోటీచేసి ఓలమి పాలయ్యారు. తన గెలుపుపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆయన తన ఓటమిని జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది...అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలు అన్నీ కన్నా...ఒకవేళ తాను పార్టీ మారాల్సివస్తే...ఏ పరిస్థితులు వస్తే పార్టీ మారదామనుకున్నారో...అచ్చంగా అలాంటి పరిస్థితులే రావడంతో ఒక పార్టీ మారే విషయం సీరియస్ గానే యోచిస్తున్నట్లు తెలిసింది.

 గతంలో లేదు...ఇప్పుడు ఆలోచన ఎందుకంటే...

గతంలో లేదు...ఇప్పుడు ఆలోచన ఎందుకంటే...

గుంటూరు జిల్లాలో బలమైన నేత...రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు...బలమైన కాపు సామాజిక వర్గం లీడర్ కన్నాలక్ష్మీనారాయణను తమ పార్టీలోకి తేవాలని జగన్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంతకాలం వైసిపి ప్రతిపాదనలు గట్టిగానే తిరస్కరిస్తూ వచ్చిన కన్నా ఇటీవలి కాలంలో కొంత మెత్తబడినట్లు...పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది...ప్రస్తుతం ఎపిలో బిజెపి పరిస్థితి ఇబ్బందికరంగా మారడం...జనజీవన స్రవంతికి దూరమైన పరిస్థితిని కన్నా ఎదుర్కోవడం...కన్నా వైసిపిలోకి వచ్చే ఆలోచనకు పునాది వేసినట్లు తెలుస్తోంది.

 వైసిపి ఆప్షన్లు ఏంటి?...కన్నా ఏమి డిమాండ్ చేయొచ్చు...

వైసిపి ఆప్షన్లు ఏంటి?...కన్నా ఏమి డిమాండ్ చేయొచ్చు...

ఇక కన్నా వైసిపిలోకి వస్తే ఆయనకు బాగా పట్టు వున్న పెదకూరపాడు నియోజకవర్గమైనా సరే...లేక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయినా సరే ఏదైనా ఇచ్చేందుకు జగన్ సిద్దపడినట్లు సమాచారం. జగన్ నుంచి ఏ నేతకైనా ఇలాంటి ఆఫర్ రావడం చాలా కష్టం అని చెప్పుకుంటున్నారు. అయితే కన్నా తనకోసం గుంటూరు పశ్చిమం...తన కుమారుడి కోసం పెదకూరపాడు...రెండు సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ కన్నాకు గుంటూరు పశ్చిమం సీటు ఇస్తామని, ఆయన కుమారుడికి తదనంతరం సముచిత పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఈ విషయమై ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని...ఇందుకోసం కొంత సమయం తీసుకున్నా ఫరవాలేదని, మీరు ఎప్పుడు వచ్చినా గుంటూరు పశ్చిమం సీటు మీకేనని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు టిడిపినే ఢిఫెన్స్ పరిస్థితుల్లో ఉన్నందున తాజా రాజకీయాలను బట్టి వైసిపిలో కన్నా చేరే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

గుంటూరు పశ్చిమం:ఒకవేళ కన్నా రాకుంటే...

గుంటూరు పశ్చిమం:ఒకవేళ కన్నా రాకుంటే...

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున మిర్చి యార్డు మాజీ చైర్మ‌న్ లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ తరుపున సిట్టింగ్ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ పోటీ చేయగా...టీడీపీ నుంచి పోటీ చేసిన న‌ర‌సారావుపేట మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఈ త్రిముఖ పోరులో విజ‌యం సాధించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ తరుపున గుంటూరు పశ్చిమం బరిలోకి దిగేందుకు అనేకమంది ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో వైకాపా తరుపున పోటీ చేసిన లేళ్ల అప్పిరెడ్డి మ‌ళ్లీ తానే పోటీలో ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా...సామాజిక సమీకరణాలు...ఆర్థిక కారణాలు... రాజకీయ ప్రాధాన్యతలు వీటన్నిటిపరంగా లేళ్ల అప్పిరెడ్డి అక్క‌డ అంత కరెక్ట్ ఆప్షన్ కాదనే నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంకా అంబటి రాంబాబు...మాజీ హోం మంత్రి చేబ్రోలు హ‌నుమ‌య్య కుమారుడు, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త చేబ్రోలు న‌రేంద్ర‌నాథ్ తదిదరులు ఇక్కడ వైసిపి తరుపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా జగన్ మాత్రం కన్నా వస్తే ఆయనకే ఈ సీటు ఇవ్వాలని భావిస్తున్నారట.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP BJP leaders are trying to strengthen party in the state ahead of 2019 assembly elections. But on the other side, that party leaders are planning to join other parties. BJP Leader Kanna Laxminarayana is likely to join YSR Congress Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి