వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ ఎఫెక్ట్, చంద్రబాబు వ్యూహం: పవన్ కళ్యాణ్ గట్టెక్కించేనా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన కాపు నేతలతో మాట్లాడుతూనే ఉన్నారని, ముద్రగడను కలిసేందుకు కూడా సిద్ధమయ్యారని వార్తలొచ్చాయి.

అదే సమయంలో మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోను టచ్‌లో ఉన్నా ఉండవచ్చునని, ఆ వాదనను కొట్టి పారేయలేమని అంటున్నారు. అంతేకాదు, రేపో ఎల్లుండో ముద్రగడతో పవన్ కళ్యాణ్ భేటీ కావొచ్చునని, చర్చలు జరుపవచ్చునని ప్రచారం సాగుతోంది.

చూద్దాం, ఏం జరుగుతోంది: రంగంలోకి పవన్ కళ్యాణ్, కానీ?చూద్దాం, ఏం జరుగుతోంది: రంగంలోకి పవన్ కళ్యాణ్, కానీ?

ముద్రగడ దీక్ష, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారనే వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. సమస్య పరిష్కారం కోసం టిడిపి.. ఇటు పవన్ కళ్యాణ్‌ని, అటు ముద్రగడను కలిపేందుకు ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ముద్రగడ విషయంలో బయటకు రానున్న పవన్ కళ్యాణ్.. ఆయన దీక్షను ప్రశ్నిస్తారా? చంద్రబాబుకు చురకలు అంటిస్తారా? లేక మధ్యేమార్గాన్ని చూసుకుంటారా? చూడాలని అంటున్నారు.

Will Pawan Kalyan save Chandrababu?

గతంలో రాష్ట్ర సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్... చంద్రబాబును ప్రశ్నించిన సందర్భాలు, అలాగే మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని అంటారు. రాజధాని నుంచి మొదలు పెడితే కాపు రిజర్వేషన్ల అంశం వరకు పవన్ కళ్యాణ్ స్పందించారు.

రాజధానిలో భూములు బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. చంద్రబాబును నిలదీశారు. అయితే, ఆయన నిలదీత పైన ఇటు టిడిపి ఆగ్రహం రాగా, మరోవైపు వైసిపి మాత్రం బాబుకు అండగా ఉండేందుకే బయటకు వచ్చాడని ఆరోపణలు గుప్పించింది.

ముద్రగడను కలవడానికి పవన్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..!! ఎట్టకేలకు.. ముద్రగడను కలవడానికి పవన్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా..!! ఎట్టకేలకు..

ఆ తర్వాత కాపు రిజర్వేషన్ అంశంలోను పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు చిక్కులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లుగా వచ్చి, ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది విపక్షాల ఆరోపణ.

అయితే, ముద్రగడ దీక్షలో అర్థం లేదనేది టిడిపి వాదన. హామీలు నెరవేర్చుతున్నప్పుడు, తుని ఘటనలో అసలైన నిందితులను పూర్తి ఆధారాలతో అరెస్టు చేసినప్పుడు, కాపులను బీసీలలో కలిపేందుకు కమిషన్ పని చేస్తున్నప్పుడు, అన్నింటికంటే ముఖ్యంగా ఇంకా గడువుకు ముందే ముద్రగడ దీక్ష చేయడంలో అర్థం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎలా స్పందిస్తారోననే చర్చ సాగుతోంది.

English summary
Will Jana Sena chief Pawan Kalyan save AP CM Chandrababu Naidu?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X