అఖిలప్రియ చక్రం: శిల్పాకు వైసిపి కాటసాని షాక్, జగన్ హామీపై ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టిడిపి నుంచి నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి దక్కనుందో తేలిపోయింది. మంత్రి అఖిలప్రియ సూచించిన ఆమె సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ దక్కనుంది.

చిన్నపిల్లని మంత్రిగా చేస్తే..: అఖిలప్రియపై శిల్పా, ఆ దూకుడు వల్లే..

శిల్పా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయనకు సొంత పార్టీ నేత నుంచి షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైసిపి నేత కాటసాని రామిరెడ్డికి భూమా బ్రహ్మానంద రెడ్డి అల్లుడు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి మద్దతు అల్లుడికే ఉంటుందని భావిస్తున్నారు.

వైసిపి నేత కాటసాని శిల్పాకు షాకిస్తారా?

వైసిపి నేత కాటసాని శిల్పాకు షాకిస్తారా?

కాటసాని రామిరెడ్డి బహిరంగంగా వైసిపి అధినేత జగన్ సూచించిన అభ్యర్థికే మద్దతు అని, శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తే అండగా ఉంటామని చెప్పినప్పటికీ అది కేవలం మాటలకే పరిమితం అవుతుందని, తన అల్లుడు బ్రహ్మానంద రెడ్డిని గెలిపించుకునేందుకు ఆయన పని చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

రాజగోపాల్ రెడ్డిపై రివర్స్..

రాజగోపాల్ రెడ్డిపై రివర్స్..

శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేరకముందు జరిగిన వైసిపి ప్లీనరీలో కాటసాని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నంద్యాల ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలుస్తారని, తమ పార్టీ అభ్యర్థి ఆయనే అని చెప్పారు. కానీ శిల్పా చేరికతో అంతా రివర్స్ అయింది.

ఈ నేపథ్యంలో కూడా కాటసాని రామిరెడ్డి తన అల్లుడు బ్రహ్మానంద రెడ్డి గెలుపు కోసం పరోక్షంగా పని చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి అఖిలప్రియ కూడా ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

మద్దతు కూడగడుతున్న అఖిలప్రియ

మద్దతు కూడగడుతున్న అఖిలప్రియ

అఖిల దూకుడును శిల్పా కూడా తట్టుకోలేకపోయారని అంటున్నారు. సోదరుడి గెలుపు కోసం ఆమె పనులు, ప్రచారాలు చేస్తున్నారు. కాటసాని మద్దతును కూడా ఆమె ఇప్పటికే కూడబెట్టారని అంటున్నారు.

జగన్ ఎదుట బలప్రదర్శనకు రాజగోపాల్ రెడ్డి సిద్ధం

జగన్ ఎదుట బలప్రదర్శనకు రాజగోపాల్ రెడ్డి సిద్ధం

మరోవైపు, నంద్యాల వైసిపి ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19వ తేదీన ఆయన పెద్ద ఎత్తున వాహనాల్లో హైదరాబాదులోని లోటస్ పాండుకు వెళ్లి పార్టీ అధినేత వైయస్ జగన్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది.

ట్విస్ట్.. ఇదీ రాజగోపాల్ రెడ్డి వర్గం వాదన..

ట్విస్ట్.. ఇదీ రాజగోపాల్ రెడ్డి వర్గం వాదన..

శిల్పా విషయమై మరో కొత్త విషయంపై ప్రచారం సాగుతోంది. వైసిపికి నంద్యాల లోకసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రస్తుతం ఎవరూ లేనందున ఆ స్థానాన్ని శిల్పా మోహన్ రెడ్డికి అప్పగిస్తారని, ఇప్పుడు ఆయనకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని రాజగోపాలరెడ్డి వర్గం, సహా పలువురు చెబుతున్నారు.

శిల్పాను అలా తీసుకొచ్చారా.. లేక షాకిస్తారా

శిల్పాను అలా తీసుకొచ్చారా.. లేక షాకిస్తారా

అదే జరిగితే, ఆ హామీ మీదనే శిల్పాను జగన్ పార్టీలోకి తీసుకొని ఉంటే అది ఎవరూ ఉహించనిదే అవుతుంది. లేదా శిల్పా నంద్యాల టిక్కెట్ గురించే పార్టీలోకి వచ్చినా 2019 లోకసభ టిక్కెట్ పేరుతో జగన్ షాకిస్తారా చూడాలని అంటున్నారు. మొత్తానికి శిల్పాకు పెద్ద చిక్కులే ఉన్నాయని అంటున్నారు. సొంత పార్టీ నేత కాటసాని టిడిపి నేతకు మద్దతు పలుకుతారనే ప్రచారం, వైసిపిలో టిక్కెట్ కోసం కొట్లాడ.. ఇవన్నీ శిల్పాకు పెద్ద తలనొప్పులే అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that YSRCP leader katasani Ramireddy may support TDP's Bhuma Brahmananda Reddy in Nandyal bypoll.
Please Wait while comments are loading...