పవన్ కల్యాణ్ లేకపోతే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గత సోమవారంనాడు జరిగిన ఎన్నికల్లో చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గతంలో ఎప్పుడు లేన్నంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు తెలపకపోతే ..ఈ ఎన్నికలు ఎలా ఉండేవనే చర్చ సాగుతోంది. చాలా క్లిష్ట సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్లారు. టీడీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వేళ పవన్ ఏకంగా జైలులోకి వెళ్ళి మరీ బాబుని పరామర్శించి వచ్చారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీడీపీ జనసేన ఒక్కటిగా ముందుకు సాగుతాయని ఆయన సంచలన ప్రకటన చేశారు. పవన్ ఇచ్చిన మద్దతునే టీడీపీ ముందుకు సాగింది.

Without Pawan Kalyan help TDP will win only 20 seats

అప్పటి నుంచి టీడీపీ నాయకుల్లో అంతులేని బలం కనిపించింది. పవన్ టీడీపీకి అండగా నిలిచిన దగ్గర నుంచే ఆ పార్టీలో జోష్ పెరిగిందనేది అక్షర సత్యం. అయితే ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు లేకపోయింటే ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలిచేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పవన్ మద్దతు లేకుండా ఉంటే కనుక టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని తలపండిన రాజకీయ విశ్లేషకుల మాట.పవన్ మద్దతు లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఏ 20 సీట్ల దగ్గరో ఆగిపోయేది అని అంతా అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి రేసులో ఉందనే చర్చ సాగుతోంది.

మరోవైపు టీడీపీ మద్దతు లేకపోతే పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. జనసేనకు ఓటు శాతం ఉన్నా అది ఎమ్మెల్యేలను గెలిపించే స్థాయిలో లేదనే విషయం అందరికి తెలిసిందే. ఇదే ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. దీంతో చేసేది లేక పవన్ టీడీపీకి మద్దతిచ్చారు. మరోవైపు కాలం కలిసి రావడంతో పవన్‌తో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. మొత్తానికి వీరిద్దరు కలిసి పోటీ చేస్తే తప్పిస్తే...విడివిడిగా పోటీ చేస్తే నెగ్గాలనే పరిస్థితి. ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడానికి మూడు పార్టీలు కలిసి గట్టిగానే శ్రమించాయి. అయినా గెలుపుపై కూటమి నేతలకు నమ్మకం కలగని పరిస్థితి. మెజార్టీ సర్వేలు తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నాయి. మరి జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+