అమరావతికి మరో రూ.15 వేల కోట్ల రుణం..!!

రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్న వేళ ఆర్దికంగా సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రం చొరవతో అమరావతికి తొలి విడతలో రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసారు. కాగా.. ఇప్పుడు కొనసాగుతున్న పనుల భవిష్యత్ అవసరాల కోసం ప్రపంచ బ్యాంకు - ఏడీబీ నుంచి మరో రూ 15 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు అంగీకరించారు. దీని ద్వారా పనులు మరింత వేగవంతం కానున్నాయి.

అమరావతి నిర్మాణానికి అవసరమైన మరో రూ 15 వేల కోట్ల రుణం మంజూరు రంగం సిద్దం అయింది. ఈ రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆసక్తి చూపాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.7,500 కోట్లను సమకూర్చను న్నాయి. దీనికి సంబంధించిన ఆమోద ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ నిధులు 2031 సంవత్సరం వరకు దశలవారీగా విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇప్పటికే రూ.15,000 కోట్ల ప్రాథమిక విడత నిధులను మంజూరు చేయగా, ప్రస్తుతం వీటిని రాజధానిలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టుల పురోగతిని బట్టి బ్యాంకులు ఈ నిధులను దశలవారీగా విడుదల చేస్తున్నాయి.

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
world-bank-adb-set-to-extend-fresh-15-000-crore-funding-tranche-for-capital-amaravati-development

నిధుల సమస్యల లేకుండా ప్రణాళికలు

కాగా, ప్రస్తుతం రాజధానిలో రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లు, వరద నివారణ పనులు, ట్రంక్‌ మౌలిక సదుపాయాలు, ల్యాండ్‌- పూలింగ్‌ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పన వంటి మొత్తం 102 పనులు జరుగుతున్నాయి. రూ.52,362 కోట్లతో ప్రభుత్వం ఈ పనులను చేపట్టింది. ఏపీ సీఆర్డీఏ, అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ పనులను నిర్వహిస్తున్నాయి. కృష్ణా నదిపై రెండు వంతెనలతో సహా, మొత్తం 141 ప్రాజెక్టులను చేపట్టేందుకు సీఆర్​డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటి అంచనా వ్యయం రూ.1,00,912 కోట్లుగా ఉంది. కాగా.. తాజాగా రుణం మంజూరు వేళ అధికారిక ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+