సూపర్ లోకేష్.. ఏపీ సర్కారుపై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు !!
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పై ప్రపంచ బ్యాంక్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో ఆయన తీసుకొస్తున్న సరికొత్త కార్యక్రమాలు, ఆధునిక పద్ధతులు విద్యా రంగానికే కాకుండా సమాజానికి గొప్ప మార్పు తీసుకొస్తున్నాయని అభినందించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంత్రి లోకేష్ ను కలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా సంస్కరణలు, డిజిటల్ లెర్నింగ్, స్కూల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలు గురించి లోకేశ్ వివరించారు. అందుకు గానూ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనిని ఆదర్శంగా పేర్కొన్నారు.
అలానే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఏపీ విద్యాశాఖలో అమలవుతున్న గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని ప్రశంసించారు. చిన్నారులలో ప్రాథమిక అక్షరాస్యత, అంకెల జ్ఞానం పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్ తరాలను బలపరుస్తున్నాయి అని అన్నారు. ప్రధానోపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకులకు అందిస్తున్న స్కూల్ లీడర్‌షిప్ శిక్షణలు అత్యంత సమర్థవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో పాఠశాలల్లో నాణ్యత పెరిగిందని బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ మోడల్‌ను అనుసరించాలని సూచించారు.

సాల్ట్ ప్రోగ్రామ్ - దక్షిణాసియాకు ఆదర్శం
సాల్ట్ (Supporting Andhra's Learning Transformation) ప్రోగ్రామ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత వినూత్నంగా అమలవుతోందని ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు భారతదేశానికే కాకుండా దక్షిణాసియా దేశాలకు రోల్ మోడల్‌గా మారిందని అభిప్రాయపడింది. అంతే కాకుండా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్, పాల్ ల్యాబ్‌లు (PAL Labs) వంటి కార్యక్రమాలను కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రస్తావించారు. విద్యార్థులు డిజిటల్ టూల్స్ ద్వారా నేర్చుకోవడం వల్ల సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెరుగుతోందని ప్రశంసించారు.
ఇక ఈ భేటీలో ఏపీ విద్యా రంగానికి ప్రపంచ బ్యాంక్ ఇంకా ఎక్కువ ఫండింగ్, టెక్నికల్ సపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. నారా లోకేశ్ కూడా అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా నిలపాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications