WTC Finalలో ఎగిరిన నారా లోకేష్ యువగళం జెండా- సెటైర్లు
కడప: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 119వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం మీదుగా నారా లోకేష్ కడపలో అడుగుపెట్టారు.
కడప శివార్లలోని ఆలంఖాన్ పల్లి వద్ద 1,500 కిలోమీటర్ల మైలురాయిని అందుకున్నారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కడపలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మురుగునీటి బెడద నుంచి విముక్తి కల్పిస్తానని అన్నారు. యువగళం సాక్షిగా కడప ప్రజల కష్టాలను తీరుస్తానని ప్రమాణం చేస్తోన్నారాయన.

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 1,500 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా లండన్‌లోని ఓవల్ స్టేడియంలో యువ గళం పాదయాత్ర జెండాను ఎగురవేశారు. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ ఫొటోపై తమదైన శైలిలో మినీ యుద్ధాన్ని సాగిస్తోన్నారు. గతంలో టీడీపీ జెండాలు ఎగిరిన మ్యాచ్‌లల్లో టీమిండియా ఓడిపోయిందంటూ వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తోండగా.. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో తొలి ఇన్నింగ్ ఆడుతోన్న ఆస్ట్రేలియా తడబడుతోంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 160 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోర్ రెండు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు ఖవాజా.
మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్, వన్ డౌన్ బ్యాటర్ మార్ముస్ లంబుషేన్.. ఇన్నింగ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. ఎనిమిది ఫోర్లతో 43 పరుగులు చేసిన వార్నర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వార్నర్ అవుట్ అయిన తరువాత లాంబుషేన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. జట్టు స్కోర్ జట్టు స్కోర్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అవుట్ అయ్యాడు. 26 పరుగులు చేసిన లాంబుషేన్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ క్రీజ్‌లో ఉన్నారు. స్టీవెన్ స్మిత్- 32, ట్రావిస్ హెడ్- 52 పరుగులతో ఆడుతున్నారు.












Click it and Unblock the Notifications