బిజెపి గొడుగు కింద చేరాలని జగన్, ఎలా నమ్ముతారు: యనమల

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని అనడం లేదని, కొంత ఇచ్చారని, కానీ అన్నీ ఇవ్వాలని తాము అడుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మరో మంత్రి కళా వెంకట్రావుతో కలిసి ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి గొడుగు కిందికి చేరాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

 కేసుల మాఫీకి జగన్

కేసుల మాఫీకి జగన్

కేసులను మాఫీ చేయించుకోవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని యనమల అన్నారు. అందుకు బిజెపితో కలవాలని ప్రయత్నిస్తున్నారని, అటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వంపై వైసిపి అవిశ్వాసం తీర్మానం పెడితే ఎలా విశ్వసిస్తారని ఆయన ప్రశ్నంచారు. బిజెపితో కలవడానికి ప్రదక్షిణలు చేస్తూనే అవిశ్వాసం పెడుతామని అనడం విడ్డూరమని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి...

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి...

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి కేసులు మాఫీ చేయించుకోవాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారని, వారి మాటల్లో అదే కనిపిస్తోందని, అందుకే వైసిపి నాటకాలు ఆడుతోందని యనమల అన్నారు. లక్ష కోట్ల రాష్ట్ర ఖజనానాను జగన్ దోచేశారని, ఆయనపై 11 కేసులు ఉన్నాయని, 60 రోజులు జైల్లో ఉన్నారని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారని, అటువంటి జగన్‌ను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు

ప్రజలు గమనిస్తున్నారు..

ప్రజలు గమనిస్తున్నారు..

వైసిపి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని హామీలను పూర్తిగా నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా ఇస్తామని కాలయాపన చేసిందని అన్నారు తమ లెక్కల ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వాలని ఆయన అన్నారు. న్యాయపరంగా రావాల్సినవి రాలేదని తమ కేంద్ర మంత్రులు రాజీనామా చేశారని ఆయన అన్నారు.

బిజెపితో అనుబంధం ఉన్నా...

బిజెపితో అనుబంధం ఉన్నా...

బిజెపితో అనుబంధం ఉన్నా తమ పోరాటం కొనసాగుతందని యయనమల రామకృష్ణుడు అన్నారు. విభజన హామీల సాధనకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని తమ ఎంపీలు పార్లమెంటు వెలుపలా, లోపలా పోరాటం చేస్తుంటే వైసిపి డ్రామాలు ఆడుతోందని ఆయన అన్నారు.

 స్వలాభం కోసం పుట్టిన పార్టీ

స్వలాభం కోసం పుట్టిన పార్టీ

వైఎస్సార్ కాంగ్రెసు స్వలాభం కోసం పుట్టిన పార్ట అని కళా వెంకట్రావు అన్నారు. స్వలాభం కోసం ఆ పార్టీ పనిచేస్తోందని, కేసులను మాఫీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తోందని, ప్రజా సంక్షేమానికి పనిచేయడం లేదని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh ministers Yanamala Ramakrishnudu and Kala Vnkat Rao lashed out at YSR Congress party president YS Jagan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి