హిందూ సంప్రదాయాలు నచ్చి: ఓహియో వ్యక్తితో యార్లగడ్డ కూతురు పెళ్లి
ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమార్తె కూతురు సాహితి వివాహం తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.
తిరుపతి: ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుమార్తె కూతురు సాహితి వివాహం తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.
అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన బ్రెంచ్ ఫ్లెచ్చర్‌తో హిందూ సంప్రదాయం ప్రకారం స్థానికంగా ఉన్న ఓ మఠంలో వివాహం జరిగింది.

యార్లగడ్డ కూతురు ఒహియోలోని టయోటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ బంధువులు వివాహ సంబంధాన్ని కుదిర్చారు. పెళ్లికి వరుడి తల్లిదండ్రులు మోరియాన్, గ్యారీ ఫ్లెచర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అనంతరం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హిందూ సంప్రదాయాలు, కట్టుబాట్లు నచ్చి తన అల్లుడు భారత్‌కు వచ్చారని, పెళ్లి జరిగిన తీరును చూసి చాలా సంతోషపడ్డారని యార్లగడ్డ తెలిపారు.












Click it and Unblock the Notifications