ఒక్క చాన్స్ ఇచ్చేసారా: ఆధిక్యతల్లో మేజిక్ ఫిగర్ దాటిన వైసీపీ : సంబరాలు మొదలు..!
జగన్ బ్రహ్మాసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చేసారా. స్పష్టమైన ఆధిక్యత దిశగా వైసీపీ. ఇప్పటి వరకు వెల్లడైన ట్రెండ్స్‌లో వైసీపీ 88 మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఏకపక్షంగా వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద సంబరాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
స్పష్టమైన ఆధిక్యత దిశగా..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే మొత్తంగా 88 సీట్లు మేజిక్ ఫిగర్‌కు చేరాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న ట్రెండ్స్‌లో వైసీపీ మేజిక్ ఫిగర్ సులువుగా దాటిపోయింది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. దీంతో.. వైసీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులు జగన్ కోసం ఉండవల్లికి తరలి వస్తున్నారు. వైసీపీ ఖచ్చితంగా 130 సీట్లకు పైగా గెలిచే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.

ఒక్క ఛాన్స్ ఇచ్చేసారా..
జగన్ కోరుకున్న విధంగా జగన్‌కు ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చేసినట్లే. జగన్ హవా ఏపీ వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది.దీంతో..ముందు నుండి జగన్ అంచనా వేసినట్లుగా విజయం దక్కుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారనే పార్టీ అభిమానుల అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. దీంతో ఇక వైసీపీ హవా అడ్డుపడే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications