• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్రమ మైనింగ్ లో చంద్రబాబు,యరపతినేని హస్తం...లీకేజీలపై సమాధానమేంటి?:బొత్సా

By Suvarnaraju
|

హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హస్తం ఉందని వైఎస్సార్‌ సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

సోమవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని బొత్సా సవాలు విసిరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలో లీకేజీలపై ప్రభుత్వ సమాధానమేంటని బొత్సా నిలదీశారు.

కొండను తవ్వి...ఎలుకను పట్టినట్లు

కొండను తవ్వి...ఎలుకను పట్టినట్లు

అక్రమ మైనింగ్ లో అసలు దోషులను కాపాడుతూ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అధికారులకు ప్రభుత్వం నోటీసులివ్వడం సిగ్గుచేటని బొత్సా సత్యనారాయణ విమర్శించారు. ఈ ఒక్క విషయంతోనే ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం ఎంతలా దోచుకుంటుందో ప్రజలకు స్పష్టంగా అర్థమయిందని బొత్సా వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ విషయమై కేసును సీఐడీకి అప్పగించడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తప్పుబట్టారు.

వాస్తవాలను...కప్పిపుచ్చేందుకే!

వాస్తవాలను...కప్పిపుచ్చేందుకే!

వాస్తవాలను కప్పి పుచ్చడం కోసమే ఆ కేసును సీఐడీకి అప్పగించారని జగన్ తన ప్రకటనలో ఆరోపించారు. అసలైన దోషులను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. తన చేతిలోని దర్యాప్తు సంస్థ ద్వారా పెద్ద తప్పును చిన్నదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష నేత తెలిపారు. పల్నాడు గనుల దోపిడీపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరిన నేపథ్యంలో జగన్ సవాలును బొత్సా పునరుద్ఘాటించారు.

సహాయక చర్యలు...పెంచండి

సహాయక చర్యలు...పెంచండి

మరోవైపు రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతోందని బొత్స చెప్పారు. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని...వరద ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు పెంచాలని ఆయన సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని బొత్సా కోరారు.

 లీకేజీలపై...సమాధానం ఏంటి?

లీకేజీలపై...సమాధానం ఏంటి?

ఉత్తరాంధ్రలో విషజర్వాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బొత్సా ఆరోపించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సచివాలయంలో లీకేజీలపై ప్రభుత్వ సమాధానమేంటని బొత్సా నిలదీశారు. గతంలో లీకేజీల గురించి ప్రస్తావిస్తే ప్రతిపక్షమే విమర్శిస్తుందే తప్పా అసలు ఏంలేదని చెప్పిన ప్రభుత్వం...ఇప్పుడు సచివాలయం లీకేజీలపై సమాధానం చెప్పాలని బొత్సా డిమాండ్‌ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad: YSR Congress Party leader Botsa Satyanarayan challenged TDP government for CBI investigation over rampant illegal mining in Guntur district. He alleged that just to keep the main accused in illegal mining, TDP MLA Yarapatineni Srinivasa Rao away from any case, the TDP government was foisting cases on innocent people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more