ఫోకస్ పెట్టిన చంద్రబాబు, వైసీపీ లీడర్ అరెస్టు, ఆ కేసులో ఇన్ని రోజులు ఎస్కేప్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం మళ్ళీ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పై జరిగిన దాడి కేసులో, టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మరో వైసీపీ నాయకుడు అరెస్టు అయ్యారు

వైసీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ కోసం మంగళగిరి పోలీసులు కొంత కొంత కాలంగా గాలిస్తున్నారు. పాలడుగు దుర్గా ప్రసాద్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గుంటుపల్లి లోని నివాసంలో దుర్గా ప్రసాద్ ఉన్నారని ఖచ్చితమైన సమాచారం అందడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అక్కడే ఆయన్ను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఉమాపై దాడి చేశారని నమోదు అయిన కేసులో పాలడుగు దుర్గాప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

YCP leader Durga Prasad arrested in case of attack on TDP headquarters

ఈ కేసులకు సంబంధించి కొంతకాలంగా దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దుర్గాప్రసాద్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్న దుర్గాప్రసాద్ ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై విచక్షణారహితంగా దాడి చేశారని నమోదు అయిన కేసులో పోలీసుల వైసీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ పై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2021 అక్టోబర్ 19వ తేదీన వైసీపీ మద్దతుదారులు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారని కేసు నమోదు అయ్యింది. వైసీపీ రాష్ట్ర నాయకుడు అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అరెస్టు అయ్యారు. ఈ కేసులో మిగిలిన వైసీపీ నాయకులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+