పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్న ఆ జిల్లాల రాజకీయాలు, కుప్పంలో చంద్రబాబుకు ?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయినా రాజకీయాలు మాత్రం చాలా వేడిగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకులు, అధికార వైసీపీకి చెందిన నాయకుల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు పుంగనూరు నియోజక వర్గం చుట్టూ తిరుగుతున్నాయని వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో సీఎం జగన్ తరువాత చాలా మంది పెద్దలు ఆ పార్టీ వ్యవహారాలు, రాజకీయాల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక రాయలసీమలో పెద్దాయనగా, రాజకీయ వ్యూహాలు పన్నడంలో వైసీపీ చాణుక్యిగా పేరు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యనవసరం లేదు. మంత్రి పెద్దిరెడ్డి ఇతర రాష్ట్రాల వారికి పరిచయం ఉన్నారు.

YCP politics revolving around Minister Peddireddy Ramachandra Reddy s house

చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మొత్తం తానై నడిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పుడు ఆయన అంచనాలు, ప్రజల నాడి ఎలా ఉంది అని లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్ది పుంగనూరు నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు, రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు.

రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ టిక్కెట్ మీద బరిలోకి దిగడం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు మాజీ సీఎంకు మద్దతు ఇవ్వడంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇక తంబళపల్లె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పోటీ చేశారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చుట్టూ తిరిగాయి.

YCP politics revolving around Minister Peddireddy Ramachandra Reddy s house

ఈ మూడు నియోజక వర్గాలతో పాటు మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించే బాధ్యత కూడా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బుజాలకు ఎత్తుకున్నారు. ఇలా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎన్నికల సమయంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో హిందూపురంలో వైసీపీ గెలుపు బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. వైసీపీలో కొన్ని జిల్లాల్లోని పలు నియోజక వర్గాల వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డికి పోలింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఏ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు ? అంటూ ఆయన ఆరా తీస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+