వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైబై బాబు.ఏపీ ప్రజ‌ల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల‌్యాండ్ స్లైడ్ విక్ట‌రీ దిశ‌గా వైసీపీ..

|
Google Oneindia TeluguNews

ఏపీ ఓట‌ర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియ‌న్లుకు అతీతంగా జ‌గ‌న్ సునామీ సృష్టించారు. టీడీపీకి 2014లో ప‌ట్టం కట్టిన ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ఈ సారి వైసీపీకి మ‌ద్దతుగా నిలిచాయి. అనంత‌పురం త‌మ కంచుకోట‌గా భావిస్తున్న టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. జిల్లాలోని 14 సీట్ల‌కు గాను 12 సీట్ల‌లో వైసీపీ గెలుపు దిశ‌గా సాగుతోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ 15సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయ‌గా.. ఈ సారి వైసీపీ అదే స్థాయిలో 15 సీట్లు వైసీపీ గెలుపు దిశ‌గా సాగుతోంది.

చంద్ర‌బాబుకు బైబై...

చంద్ర‌బాబుకు బైబై...

బైబై బాబు..ఇది ష‌ర్మిళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నినాదం. ఇప్పుడు ప్ర‌జ‌లు ఓట్ల ద్వారా అదే చెప్పారు. విజ‌యం పైన ధీమా వ్య‌క్తం చేసిన టీడీపీ శ్రేణులు ఫ‌లితాల ట్రెండ్స్ చూసిన త‌రువాత కామ్ అయిపోయారు. ఇప్పుడు ప్రాంతాల‌కు..జిల్లాల‌కు అతీతంగా వైసీపీ విజ‌యం సాధించింది. దాదాపు 150 సీట్ల‌లో విజ‌యం దిశ‌గా వైసీపీ దూసుకెళ్తోంది. టిడిపి కంచుకోట‌లు గా ఉన్న అనేక జిల్లాల్లో సైతం టీడీపీ అడ్ర‌స్ లేకుండా పోయింది. చంద్ర‌బాబు ఒక ద‌శ‌లో వెనుక‌బ‌డ్డారు. మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఎదురీదుతున్నారు. అక్క‌డ వైసీపీ నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 14 వేల మెజార్టీతో ఉన్నారు. మంత్రులు దాదాపు అందరూ వెనుక బ‌డ్డారు. కేవ‌లం 25 స్థానాల్లో మాత్ర‌మే టీడీపీ ఆధిక్య‌త సాగుతోంది.

అయిదు జిల్లాల్లో వైసీపీ స్వీప్‌..

అయిదు జిల్లాల్లో వైసీపీ స్వీప్‌..

ఊహించ‌ని ఫ‌లితాలు వైసీపీ నేత‌ల‌కు సంతోషాన్ని పెంచుతున్నాయి. వార్ ఒన సైడ్ గానే సాగింది. అయిదు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశ‌గా సాగుతోంది. క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకుంటోంది. అదే విధంగా క‌ర్నూలులో తాము అధిక్య‌త సాధిస్తామ‌ని చెప్పిన టీడీపీ నేత‌ల‌కు షాక్ ఇచ్చేలా ఆ జిల్లాలోని మొత్తం 14 స్థానాల‌కు గాను 13 స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉండి.

 ఊహించ‌ని ఫ‌లితాల‌తో టీడీపీ

ఊహించ‌ని ఫ‌లితాల‌తో టీడీపీ

అనంత‌పురం లో గ‌తంలో టీడీపీకి 12 సీట్లు..వైసీపీకి 2 స్థానాలు రాగా..ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. అక్క‌డ ప్ర‌స్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్ర‌కారం వైసీపీ 12 స్థానాల్లో..టీడీపీ రెండు స్థానాల్లో ఆధిక్య‌త‌లో ఉంది. ఇక‌, 2014 లో ప‌శ్చిమ గోదావ‌రిలో మొత్తంగా 15 సీట్లు సాధించి స్వీప్ చేయ‌గా..ఇప్పుడు వైసీపీ అదే త‌ర‌హాలో అక్క‌డ మొత్తం 15 స్థానాల్లో వైసీపీ స్వీప్ దిశ‌గా సాగుతోంది. ఊహించ‌ని ఫ‌లితాల‌తో టీడీపీ ఖంగుతింటే.. ఇక్క‌డ వైసీపీ మాత్రం అధినేత జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగానే ల్యాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తోంది.

English summary
YCP land slide vicotry in AP Elections. Results trends seems to be YCP comfort win. YCP clean sweep in five districts in AP. Pawan Kalyan trail in contested two segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X