Richest CM: ఇండియాలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా..!

ఇండియాలో అత్యంత ధనవతండైన సీఎం(Richest CM) ఎవరని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల నిర్వహించిన పోల్ అఫిడవిట్‌ల విశ్లేషణలో అసక్తికరమైన విషయం బయటపడింది.భారతదేశంలోని 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రులలో 29 మంది కోటీశ్వరులు అంటే కనీసం రూ. కోటి విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని వెల్లడైంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 30 మంది ప్రస్తుత సీఎంల స్వీయ-ప్రమాణ ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించిన తర్వాత ADR ఈ నిర్ణయానికి వచ్చింది.

YS Jagan Mohan Reddy

ఈ 29 మంది కోటీశ్వరుల సగటు ఆస్తులు దాదాపు రూ.33.96 కోట్లుగా ఉంది. 510 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. అత్యల్ప మొత్తం ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమెకు రూ. 15 లక్షలు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.

ఆస్తుల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ. 163 కోట్లకు పైగా ఆస్తులు, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ రూ.63 కోట్లకు పైగా ఆస్తులతో ఉన్నారు.

అత్యల్పంగా ప్రకటించిన ఆస్తులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ రూ. 15 లక్షలు, కేరళకు చెందిన పినరయి విజయన్ రూ. 1 కోటి కంటే ఎక్కువ, హర్యానాకు చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ రూ. కోటి విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని ADR తెలిపింది.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఢిల్లీకి చెందిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.3 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని వెల్లడించింది. 43% మంది ముఖ్యమంత్రులు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించినట్లు నివేదిక వెల్లడించింది.

ముఖ్యమంత్రులలో 29 మంది పురుషులు కాగా, ఒకరు మాత్రమే స్త్రీ ఉన్నారు. ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విద్య పరంగా, 30% మంది పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముప్పై మందిలో ఒకరు మాత్రమే డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు సీఎం లేరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+