పెళ్లికి యువతి నో: అసభ్యకర సందేశాలు, బెదిరింపులు

ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష గట్టాడు. ఆమె పేరిట నకిలీ ఈమెయిల్ ఐడిలు సృష్టించి అసభ్యకర సందేశాలు పంపించడమే కాకుండా పెళ్లి సంబంధాలు చెడగొడుతూ.. బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాదులో ఉంటున్న బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు.
ఇద్దరి అరెస్ట్
ఇరిడియం అని బురిడీ కొట్టించి సీసం అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంకు చెందిన రమేష్, హన్మకొండకు చెందిన రాజేంద్రప్రసాద్‌లను హైదరాబాదులోని మల్లేపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications