వైయస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు: వీడియో!

Posted By:
Subscribe to Oneindia Telugu
  వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు. వీడియో !

  ఆంధ్ర రాష్ట్ర ఆశాజ్యోతి, నిరాడంబరుడు, నిష్కల్మష్కుడు, మనసున్న మారాజు,ఎన్ని కష్టాలు వచ్చినా ఢీకొని నిలబడి పోరాటం చేస్తున్న రాజన్న బిడ్డ వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను జగన్ అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.

  ఆరోపణలు... విమర్శలు... రాజకీయాలలో సహజం.... అవి వాస్తవమా... అవాస్తవమా అనేది న్యాయస్థానం ఎలానూ తేలుస్తుంది ..... అయితే...ఏళ్లతరబడి సాగదీయడమూ...ఒక రాజకీయమే.... వదిలి వచ్చిన మాతృ పార్టీ కాంగ్రెస్ .....అధికారం లో ఉన్న పార్టీ tdp, అధికారం లో ఉన్న tdp పార్టీ కి మద్దత్తు గా నిలిచిన పార్టీ లు....ఇలా అందరూ నిరంతరం విమర్శలతో అటు ప్రింట్...ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో హోరెత్తిస్తున్నా ..వాటిని భరిస్తూ... ముందుకు సాగుతున్న అసహాయ శూరుడు అలుపెరుగని పోరాట యోధుడు అయిన జగన్ తను నమ్మిన బాటలో నడుస్తూ, తన సామర్ధ్యం తో గెలిపించుకున్న వారు ఇతర పార్టీ పాలు అవుతున్నా ఒక మంచి రేపటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్తీ అద్యక్ష్యుడు, ఎపి ప్రతిపక్ష నేత వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  YS Jagan Birthday Celebrations, Watch

  జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న ఆయన గురువారం ఉదయం నల్లమడలో పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్‌ కట్ చేశారు.

  నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం గల నేత సీఎం కావాలన్న ఆలోచనతో చంద్రబాబుకు ఏపీ వాసులు ఓటేశారు. తాజాగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ప్రజా సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు. 2019 లో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YS Jagan Birthday Celebrations going on in PrajaSankalpaYatra, Watch Video To Know More.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి